అంతర్జాల స్వేచ్ఛా పిపాసి, RSS, Redditల నిర్మాత ఆత్మహత్య

విజ్ఞానం ఒకరి సొత్తు కాదనీ, అది అందరికీ స్వేచ్ఛగా అందుబాటులో ఉండాలని పోరాడిన ఆరన్ స్వార్జ్ ఎఫ్.బి.ఐ వేధింపుల ఫలితంగా ఆత్మహత్య చేసుకున్నాడు. 14 సంవత్సరాల అతి పిన్న వయసులోనే ప్రఖ్యాత వెబ్ ఫీడ్ వ్యవస్థ అయిన RSSను నిర్మించిన ఆరన్ ఆ తర్వాత సోషల్ న్యూస్ వెబ్ సైట్ Reddit నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించాడు. పిన్న వయసులోనే ఇంటర్నెట్ మేధావి గానూ, గుత్త స్వామ్య వ్యతిరేకి గానూ అవతరించిన ఆరన్ 26 యేళ్ల వయసులోనే…