మెడల్స్ క్రెడిట్ ఆటగాళ్లదేనా? -కార్టూన్
యూపిఏ ఏలుబడిలో ఎలాంటి సానుకూల పరిణామం జరిగినా అది రాహుల్ గాంధీకో, సోనియా గాంధీకో క్రెడిట్ అయ్యేది. ఏమన్నా (ఒప్పుకోవలసిన) తప్పులు జరిగితే మాత్రం అవి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఖాతా లోకి వెళ్లిపోయేవి. ఎన్‌డిఏ-2 ఏలుబడిలోనూ అంతే. పాత్రధారులు మారారు గానీ సీన్ మారలేదు. జిడిపి వృద్ధి రేటు పెరిగినా, చమురు ధరలు తగ్గి ద్రవ్యోల్బణం తగ్గినా, ఉప ఎన్నికల్లో గెలిచినా… అవన్నీ మోడి గాలి + అమిత్ షా చాణక్య ఎత్తుల ఫలితంగానే…
