విధాన నిర్ణయాలు మా సార్వభౌమ హక్కు, ఒబామాకు ఇండియా సమాధానం
రిటైల్ అమ్మకాలు లాంటి రంగాల్లో విదేశీ పెట్టుబడులకు భారత దేశం అడ్డుపడుతోందన్న ఒబామా ఆరోపణను భారత ప్రభుత్వం తిరస్కరించింది. ఆరోపణలు చేసే బదులు ‘ప్రొటెక్షనిజం’ ను అరికట్టడంలో ఒబామా తన నాయకత్వ ప్రతిభ కనబరచాలని కోరింది. భారత దేశంలో విదేశీ రిటైల్ పెట్టుబడులు వాస్తవంగా పెరుగుతున్నాయనీ రిటైల్ పెట్టుబడులకు ఇండియాలో ఆటంకాలు లేవనడానికి అదే సాక్ష్యమని భారత వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ వివరించాడు. సంస్కరణలు అమలు చేయడంలో, సరళీకరణ విధానాలు చేపట్టడంలో ఇండియా వాస్తవానికి వేగంగా…
