జూనియర్ సివిల్ జడ్జి పరీక్షల్లో మెరిట్ వాదన గల్లంతు!
NRI Quota Vs. Caste Quota సేవ్ మెరిట్, సేవ్ ఇండియా అంటూ అగ్ర కులాల విద్యార్ధులు 1980, 1990 దశాబ్దాల్లో ఉద్యమాలు నిర్వహించారు. రిజర్వేషన్ల వల్ల దేశం వెనుకబడి పోతున్నదంటూ ఆక్రోశించారు. అగ్ర కులాల విద్యార్ధులకు ఇంజనీరింగ్, మెడిసిన్ మొ.న కాలేజీలలో సీట్లు రాకపోయినా, లేక ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎంపిక కాకపోయినా అందుకు ప్రధమ, ఏకైక కారణం రిజర్వేషన్లే కారణం అని వారు వాదించారు. వీళ్ళు కేవలం తమకు విద్య, ఉద్యోగాలలో సీట్లు రాకపోవడం ఒక్కటే…




