బ్యాంకు రిజర్వు రేట్లను మళ్ళీ పెంచిన చైనా
చైనా మరోసారి రిజర్వు రిక్వైర్ మెంట్ రేటును పెంచింది. ద్రవ్యోల్బణం రికార్టు స్ధాయిలో 5.4 శాతానికి చేరుకోవడంతో చైనా మార్కెట్ల్లొ చలామణీలో ఉన్న డబ్బును నియంత్రించాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటివరకు 20 శాతంగా ఉన్న రిజర్వు రిక్వైర్ మెంట్ రేటును (ఆర్.ఆర్.ఆర్) 20.5 శాతానికి పెంచింది. వాణిజ్య బ్యాంకులు తాము సేకరించీన్ డిపాజిట్లలొ రిజర్వు డబ్బుగా అట్టి పెట్టవలసిన డబ్బు శాతాన్ని రిజర్వు రిక్వైర్ మెంటు శాతం అంటారు. ఇండియాలొ దీన్ని సి.ఆర్.ఆర్ (క్యాష్ రిజర్వు రేషియో)…