ఆర్చరీ ప్రపంచ కప్ గోల్డ్ మెడలిస్టును కంటతడి పెట్టించిన మీడియా
ఎలక్ట్రానిక్ మీడియా దురహంకార చేష్టలు విలువిద్యలో దేశానికి గోల్డ్ మెడల్ తెచ్చిన యువతిని కంటతడి పెట్టించాయి. ఒక రోజంతా విమానంలో ప్రయాణించడంతో తిండి, నిద్ర లేవనీ, అర్జెంటుగా మరో విమానం ఎక్కాల్సి ఉన్నదనీ వేడుకుంటున్నా వినిపించుకోకుండా ఇంటర్వ్యూల కోసం పట్టుబట్టడంతో భారత దేశంలో అత్యున్నత ప్రతిభ కల క్రీడాకారిణిగా భావించబడుతున్న దీపికా కుమారి సున్నితంగా తిరస్కరించింది. తాము టి.విల్లో చూపించడమే గొప్పగా భావించే మీడియా విలేఖరులు దీపిక పరిస్ధితి పట్టించుకోకుండా అహంకారి అని దూషించడంతో ఆమె కన్నీటి…