రాహుల్ పట్టాభిషేకం సమస్య ఎవరిది? -కార్టూన్
భారత దేశంలో రాజకీయ పార్టీలు తమ సమస్యలను ప్రజల సమస్యలుగా చేయడం పరిపాటి. సోనియా గాంధీ చరిష్మా కాంగ్రెస్ పార్టీకి చేరకుండా ఉండడానికి ఆమె ఇటలీ పౌరసత్వం ఒక సమస్యగా ప్రజలపై రుద్దడానికి ప్రయత్నం జరిగింది. సోనియా పౌరసత్వాన్ని మించిన సమస్యలు చాలానే ఉండడంతో ప్రజలు ఆ సంగతే పట్టించుకోలేదు. ‘హిందూ మత పరిరక్షణ’ అనే సమస్య కూడా కాంగ్రెస్ నుండి అధికారం లాక్కోవడానికి కృత్రిమంగా ప్రజలపై రుద్దబడినదే. సోనియా చరిష్మా ఇక ముంగింపుకు వచ్చిందని భావిస్తున్నారేమో,…
