లాభాల్లో షేర్లు, ప్రణబ్ సవరణపై వివరణ ఫలితం?

శుక్రవారం భారత షేర్ మార్కెట్లు అత్యధిక లాభాలతో ముగియగా, రూపాయి బాగా కోలుకుంది. బి.ఎస్.ఇ సెన్సెక్స్ రికార్డు స్ధాయిలో 2.59 శాతం (439 పాయింట్లు) లాభ పడగా డాలరుతో రూపాయి మారకం విలువ దశాబ్ధంలోనే రికార్డు స్ధాయిలో 119 పైసలు పెరిగింది. ఇటలీ, స్పెయిన్ దేశాలకు ఋణాల రేట్లు తగ్గించడానికి యూరోపియన్ దేశాల సమావేశం నిర్ణయాత్మక చర్యలు ప్రకటించడమే భారత మార్కెట్ల ఉత్సాహానికి కారణమని రాయిటర్స్ వార్తా సంస్ధ విశ్లేషించగా, ప్రణబ్ సవరణపై (GAAR) ఆర్ధిక శాఖ…

రాష్ట్రపతి ఎన్నిక: సి.పి.ఎం సిద్ధాంతకర్త ప్రసేన్ జిత్ బహిష్కరణ

సి.పి.ఎం పార్టీ రీసెర్చ్ యూనిట్ కన్వీనర్ ప్రసేన్ జిత్ బోస్ ను ఆ పార్టీ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. నిజానికి రాష్ట్రపతి పదవికి ప్రణబ్ ముఖర్జీ అభ్యర్ధిత్వానికి సి.పి.ఎం పార్టీ మద్దతు ప్రకటించడానికి నిరసనగా ప్రసేన్ జిత్ పార్టీకి రాజీనామా చేశాడు. రాజీనామా తిరస్కరిస్తూ బహిష్కరణ నిర్ణయాన్ని సి.పి.ఎం పార్టీ తీసుకుంది. కాంగ్రెస్, బి.జె.పి పార్టీలపై రాజకీయ పోరాటం సాగించాలని ఏప్రిల్ మహాసభల్లో నిర్ణయించిన సి.పి.ఎం పార్టీ, ఇంతలోనే కుంటి సాకులతో యు.పి.ఏ అభ్యర్ధికి మద్దతు ప్రకటించడం సైద్ధాంతిక…

కట్టెలమ్మిన చోట పూలమ్మనున్న ప్రణబ్ -కార్టూన్

పాలక కూటమి తరపున రాష్ట్రపతి పదవికి పోటీదారుడుగా ప్రణబ్ ముఖర్జీ ఖరారయ్యాడు. ఆర్ధికంగా సమస్యలు తీవ్రం అవుతున్న దశలోనే అనుభవజ్ఞుడయిన ప్రణబ్ ముఖర్జీని ఆర్ధిక మంత్రిగా వదులుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్దపడడం ఒకింత ఆశ్చర్యకరమే. అయితే మమత బెనర్జీ సహాయ నిరాకరణ, ఆంధ్ర ప్రదేశ్ లాంటి చోట్ల పార్టీ బాగా బలహీనపడుతుండడం లాంటి పలు కారణాల నేపధ్యంలో రానున్న రోజుల్లో కేంద్రంలో రాజకీయంగా గడ్డు పరిస్ధితులు ఎదురుకావచ్చని కాంగ్రెస్ భావిస్తున్నట్లు కనిపిస్తొంది. ప్రతిపక్ష ఎన్.డి.ఎ కూటమి అంతర్గత కుమ్ములాటలతో…

యు.పి.ఎ రాష్ట్రపతి అభ్యర్ధి ఎవరు? -కార్టూన్

కేంద్ర ప్రభుత్వంలో అధికారం నెరుపుతున్న యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ తమ రాష్ట్రపతి అభ్యర్ధిని ప్రకటించలేక మల్లగుల్లాలు పడుతోంది. కూటమి నాయకురాలు కాంగ్రెస్ కి, రెండవ అతి పెద్ద పార్టీ త్రిణమూల్ కాంగ్రెస్ నుండే షాక్ ట్రీట్ మెంట్ ఎదురయింది. కాంగ్రెస్ తన అభ్యర్ధిగా ప్రణబ్ ముఖర్జీని ప్రమోట్ చేస్తుండగానే, త్రిణమూల్, మాజీ రాష్ట్రపత్రి అబ్దుల్ కలాం ను తన ఫేఫరెట్ గా ప్రకటించింది. పనిలో పనిగా ప్రధాని మన్మోహన్ సింగ్ ను కూడా రాష్ట్రపతి పదవికి ఒక…

క్లుప్తంగా… 05.05.2012

జాతీయం వేచి చూస్తాం -రాష్ట్రపతి ఎన్నికపై లెఫ్ట్ పార్టీలు రాష్ట్ర పతి ఎన్నికకు సంబంధించి వేచి చూడడానికి నిర్ణయించుకున్నామని లెఫ్ట్ పార్టీలు తెలిపాయి. సి.పి.ఐ, సి.పి.ఎం, ఆర్.ఎస్.పి ఫార్వర్డ్ బ్లాక్ న్యూఢిల్లీలో సమావేశమై మాట్లాడుకున్న అనంతరం తమ నిర్ణయం ప్రకటించాయి. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్.సి.పి పార్టీ మాత్రం ఉప రాష్ట్రపతి ‘హమీద్ అన్సారీ’ కంటే ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ యే తమకు ఆమోదయోగ్యమని ప్రకటించింది. అంతిమ నిర్ణయం తీసుకునే ముందు ‘సెక్యులర్’ పార్టీల అభిప్రాయం…

క్లుప్తంగా…. 01.05.2012

రాష్ట్రపతి ఎన్నిక పై ఎన్.డి.ఏ లో విభేదాలు రాష్ట్రపతి ఎన్నిక విషయంలో కాంగ్రెస్ తో సహకరించే విషయమై ఎన్.డి.ఏ కూటమిలో విభేదాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ ప్రతిపాదించిన ఉపరాష్ట్ర పతి అన్సారీ, కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ లలో ఎవరికీ మద్దతు ఇవ్వబోమని బి.జె.పి ప్రకటించడం పట్ల జె.డి(యు) నిరసన తెలిపింది. 2014 ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ వెంట తాము లేమని చెప్పుకోవలసిన అవసరం ఉందని బి.జె.పి నాయకురాలు సుష్మా స్వరాజ్ పత్రికలతో మాట్లాడుతూ చెప్పారు. తమతో…