సెబి రెగ్యులేటర్ రూల్స్ ఉల్లంఘించింది -రాయిటర్స్
అమెరికాకు చెందిన పరిశోధన సంస్థ మరియు షార్ట్ సెల్లర్ అయిన హిండెన్ బర్గ్ రీసర్చ్, సెబి రెగ్యులేటర్ (సెబి ఛైర్మన్) మాధాబి పూరి బక్ పై చేసిన ఆరోపణలలో వాస్తవం ఉన్నట్లు తమ పరిశోధనలో తేలినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ ప్రకటించింది. హిండెన్ బర్గ్ రీసర్చ్ గతంలో ఆదాని కంపెనీపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి విదితమే. అదాని గ్రూప్ కంపెనీ భారీ అప్పుల్లో కూరుకుపోయి ఉన్నదనీ, టాక్స్ హేవెన్ (పన్నులు అతి తక్కువగా ఉండే) దేశాలను…

