రాయల తెలంగాణ కాకపోవచ్చు!
తెలంగాణ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. జి.ఓ.ఎం సభ్యులు రాయల తెలంగాణకు మొగ్గు చూపుతున్నట్లు సోమ, మంగళవారాల్లో దాదాపు పత్రికలన్నీ ఊహాగానాలు చేశాయి. కానీ మంగళవారం రాత్రికి జి.ఓ.ఎం సభ్యులు మళ్ళీ 10 జిల్లాల తెలంగాణే బెటర్ అని భావించినట్లు తెలుస్తోంది. రాయల తెలంగాణను బి.జె.పి దృఢంగా తిరస్కరించడమే దానికి కారణం అని ది హిందు తెలిపింది. బి.జె.పి మద్దతు లేకుండా ఆంధ్ర ప్రదేశ్ విభజన అసాధ్యం. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందాలంటే బి.జె.పి మద్దతు తప్పనిసరి.…
