పీడనకు ఎదురొడ్డింది బ్రిటనూ, ఆస్ట్రేలియా కాదు స్వతంత్ర ఈక్వడార్! -అస్సాంజ్

“పీడన నుండి నన్ను కాపాడడానికి నిలబడ్డ దేశం బ్రిటన్ కాదు, జన్మ భూమి ఆస్ట్రేలియా కూడా కాదు… ఒక సాహసోపేతమైన స్వతంత్ర లాటిన్ అమెరికా దేశం.” ఈ మాటలన్నది జూలియన్ అస్సాంజ్. స్వీడన్ అనే ఒక స్కాండినేవియా దేశాన్ని ముందు నిలిపి దుష్ట శక్తి అమెరికా రెండు సంవత్సరాలుగా సాగిస్తున్న పీడననూ, వేధింపులనూ ఎదుర్కొంటున్న జూలియన్ అస్సాంజ్ అన్న మాటలు. ప్రజా స్వామ్యానికీ, మానవ హక్కులకూ, స్వేచ్ఛా సమానత్వాలకూ భూతల స్వర్గంగా జబ్బ చరుచుకునే ప్రపంచ పోలీసు…