జైట్లీ రక్షణకే సి.బి.ఐని ఉసిగొల్పారు -ఢిల్లీ సి.ఎం

కేంద్ర ఆర్ధిక మంత్రి, ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ మాజీ ప్యాట్రన్ కూడా అయిన అరుణ్ జైట్లీని క్రికెట్ అవినీతి కేసు నుండి రక్షించడానికే తన కార్యాలయంపై సి.బి.ఐ దాడి జరిగిందని ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ప్రధాని మోడిని ‘పిరికిపంద’ అనీ, ‘సైకోపాత్’ అనీ నిందించినందుకు విమర్శలు ఎదుర్కొంటున్న అరవింద్ తన నిందలను ఉపసంహరించుకునేందుకు నిరాకరించారు. ట్విట్టర్ పోస్టుల ద్వారా సాగించిన నిందలకు క్షమాపణ చెప్పాలన్న బి.జె.పి డిమాండ్ కు బదులుగా “మోడి…