మమతాగ్రహం: సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ స్టూడియోలో ఏం జరిగింది?

శుక్రవారం సాయంత్రం సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ చానెల్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీతో లైవ్ ముఖా ముఖి నిర్వహించింది. కలకత్తాలో ప్రఖ్యాతి చెందిన ‘టౌన్ హాల్’ లో జరిగిన ఈ ముఖాముఖీలో యూనివర్సిటీ విద్యార్ధినులు అడిగిన  ప్రశ్నలకు అసహనం చెంది, వారిపైన ‘మావోయిస్టు’ ముద్రవేసి ఇంటర్వ్యూ నుండి అర్ధాంతరంగా లేచి వెళ్లిపోయింది. ముఖాముఖీలో హాజరై ఆమెకి నచ్చని ప్రశ్నలు అడిగినందుకు విద్యార్ధినీ, విద్యార్ధులకు మావోయిస్టులతోనూ, సి.పి.ఐ(ఎం) తోనూ సంబంధాలున్నాయేమో విచారించాలని పోలీసులకు ఆదేశాలిచ్చింది. టౌన్ హాల్ లో ఏం…

టి.వి ఇంటర్వ్యూ మధ్యలోనే ఆగ్రహంతో వెళ్ళిపోయిన మమత

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తన ఫాసిస్టు ఉద్దేశాలను మరోసారి వెళ్లగక్కింది. విద్యార్ధులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి బదులు “మీరంతా మావోయిస్టులు, సి.పి.ఐ (ఎం) పార్టీ వాళ్ళు” అని ఆరోపిస్తూ టి.వి ఇంటర్వూని మధ్యలోనే వదిలి వెళ్లిపోయింది. ప్రశ్నలను అడుగుతున్న విద్యార్ధులందరినీ ఫోటోలు తీసి విచారించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ చానెల్ మోడరేటర్ సాగరికా ఘోష్ వారంతా విద్యార్ధులని చెబుతున్నా వినకుండా స్టూడియో నుండి ఆగ్రహంతో ఊగిపోతూ వెళ్లిపోయింది. పోలీసులు ఇప్పటికే…

‘పర్షియన్ గల్ఫ్’ వివాదంపై గూగుల్ కి ఇరాన్ హెచ్చరిక

మధ్య ప్రాచ్యం (పశ్చిమాసియా) లో ప్రధాన నీటి అఖాతం ‘పర్షియన్ గల్ఫ్’ పేరును గూగుల్ తన మేప్ సర్వీస్ లో తొలగించడం పై న్యాయ చర్యలు తీసుకుంటానని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ ను ఇతర గల్ఫ్ దేశాలనుండి ‘పర్షియన్ గల్ఫ్’ సముద్ర జలాలు వేరు చేస్తాయి. ప్రపంచంలోనే భారీ స్ధాయిలో క్రూడాయిల్ నిల్వలు ఈ సముద్ర జలాల్లో ఉన్నట్లు కనుగొన్నప్పటి నుండీ ఈ ప్రాంతానికి ఆర్ధిక, రాజకీయ, వాణిజ్య ప్రాముఖ్యత పెరిగింది. ఈ జలాల్లో ఉన్న హోర్ముజ్…

‘అంబేద్కర్ కార్టూన్’ గొడవ ‘అంబేద్కర్’ కే అవమానం -దళిత సంఘాలు

‘అంబేద్కర్ కార్టూన్’ పై పార్లమెంటులో జరిగిన రగడ రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ కే తీవ్ర అవమానమనీ, భావ ప్రకటనా స్వేచ్ఛ పైన దాడి అనీ దళిత సంఘాలు, పౌర హక్కుల సంఘాలు ప్రకటించాయి. “నెహ్రూ-అంబేద్కర్ కార్టూన్ గానీ, దానితో ఉన్న పాఠ్యం గానీ దానంతట అదే అభ్యంతరకరం కాదని స్పష్టంగా చెబుతున్నాం. నిజానికి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ నాయకత్వంలో ‘రాజ్యాంగ అసెంబ్లీ’ నిర్వహించిన కష్టమైన పనిని అది సమున్నతంగా అభినందించేదిగా ఉంది” అని వివిధ హక్కుల…

క్లుప్తంగా… 14.05.2012

జాతీయం పార్లమెంటుకి 60 సంవత్సరాలు భారత పార్లమెంటు సమావేశమై ఆదివారం (మే 13) తో 60 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పార్లమెంటు ఆదివారం ప్రత్యేకంగా సమావేశం జరిపింది. రాజ్య సభ లో ప్రధాని మన్మోహన్, లోక్ సభలో ఆర్ధిక మంత్రి ప్రణబ్ చర్చ ప్రారభించారు. పార్లమెంటులో పదే పదే అవాంఛనీయ సంఘటనలు జరగడం పట్ల ప్రధాని ఆందోళన వెలిబుచ్చాడు. “సమావేశాలకు ప్రతిరోజూ ఆటంకాలు ఎదురు కోవడం, వాయిదాలు పడడం, కేకలు వేయడం వల్ల బైటి వారికి…

క్లుప్తంగా… 11.05.2012

మోడి నాలుగ్గోడల మధ్య చట్ట వ్యతిరేక ఆదేశాలిస్తే తప్పు కాదు –సిట్ 2010 లో అయిదేళ్లలోపు పిల్లల మరణాలు 16.8 లక్షలు జి8 సమావేశానికి పుటిన్ ఎగనామం, అమెరికాపై నిరసనతోటే స్వలింగ వివాహాలకి ఒబామా ఆమోదం జాతీయం మోడి నాలుగ్గోడల మధ్య చట్ట వ్యతిరేక ఆదేశాలిస్తే తప్పు కాదు –సిట్ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి నాలుగు గోడల మధ్య అధికారులకు చట్ట వ్యతిరేక ఆదేశాలిస్తే అది నేరం కాబోదని గుజరాత్ అల్లర్లపై నియమించబడిన ‘స్పెషల్ ఇన్వెస్టివేషన్…

పాఠ్య గ్రంధాల్లో 200 కార్టూన్ల సమీక్షకు నిర్ణయం

ఎన్.సి.ఇ.ఆర్.టి (National Council of Educational Research and Training) రూపొందించిన పాఠ్య గ్రంధాల్లో ఉన్న కార్టూన్లు అన్నింటినీ సమీక్షించి తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంబేడ్కర్, నెహ్రూ లతో ఉన్న కార్టూన్ పై చెలరేగిన అనవసర వివాదం స్కూల్ పిల్లలకు వివిధ అంశాలపై సాపేక్షికంగా తేలిక పద్ధతిలో అవగాహన కల్పించే ఒక బోధనా పద్ధతి ని దెబ్బ కొట్టింది. కార్టూన్ల ద్వారా వివిధ రాజకీయ శాస్త్రాంశాలను బోధించే పద్ధతి స్కూల్ పాఠ్య గ్రంధాల నుండి మాయం…

యెడ్యూరప్ప రాజీనామా వాయిదా, కర్ణాటక సంక్షోభం తీవ్రం

సోమవారం భవిష్యత్తు నిర్ణయించుకుంటానని చెప్పిన యెడ్యూరప్ప బి.జె.పి కి రాజీనామా చేసే నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడు. ఎం.ఎల్.ఎ ల ఒత్తిడితో పాటు పార్టీ సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ విజ్ఞప్తి మేరకు తన రాజీనామా నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు పత్రికలకు చెప్పాడని ఎన్.డి.టి.వి తెలిపింది. అయితే ముఖ్యమంత్రి సదానంద గౌడ పై ఆయన విమర్శలు కొనసాగించాడు. మరో వైపు బి.జె.పి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడాన్ని కొట్టి పారేయలేమని జనతా దళ్ (సెక్యులర్) నాయకుడు సిద్ధ రామయ్య…

అవినీతి సహచరులను కాపాడుతున్నందుకు సోనియాపై యెడ్యూరప్ప ప్రశంసలు

కర్ణాటక మాజీ ముఖ్య మంత్రి యెడ్యూరప్ప కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పై ప్రశంసలు కురిపించాడు. సోనియా తో పాటు ఆమె పార్టీని కూడా యెడ్యూరప్ప ప్రశంసించాడు. బి.జె.పి లాగా కాకుండా కష్టాల్లో ఉన్న పార్టీ మంత్రులకు కాంగ్రెస్ గానీ, ఆ పార్టీ నాయకురాలు గానీ తోడు నిలుస్తారనీ, మద్దతునిచ్చి కాపాడుకుంటారని ఆయన పొగడ్తలు కురిపించాడు. కర్ణాటక ముఖ్య మంత్రి సదానంద గౌడ ను ‘మోసగాడి’ గా ఆయన తిట్టిపోసాడు. ఆరు నెలల తర్వాత తన ముఖ్య…

తననూ వదలొద్దని కోరిన నెహ్రూ -కార్టూన్

ప్రజాస్వామిక వ్యవస్ధకు ‘ఫోర్త్ ఎస్టేట్’ గా పత్రికలను అభివర్ణించడం అందరూ ఎరిగిందే. కార్టూన్ ద్వారా రాజకీయ విమర్శలు చేయడం అత్యంత శక్తివంతమైన ప్రక్రియగా పత్రికలు అభివృద్ధి చేశాయి. కాసిన్ని గీతల ద్వారా ప్రకటించే రాజకీయ అభిప్రాయాలని నిషేధించాలని కోరడం అంటే ప్రజాస్వామ్య వ్యవస్ధలో అత్యంత ముఖ్యమైన ‘భావప్రకటనా స్వేచ్ఛ’ కు సంకెళ్లు వేయాలని కోరడమే. అందుకే ప్రజాస్వామ్య ప్రియులైన రాజకీయ నాయకులు తమను తాము విమర్శలకు అతీతులుగా ఎన్నడూ పరిగణించరు. భారత దేశ ప్రధమ ప్రధాని ‘జవహర్…

అంబేడ్కర్ కార్టూన్ పై సిబాల్ ‘సారీ’, ఇద్దరు ప్రొఫెసర్లు రాజీనామా

ఎన్.సి.ఇ.ఆర్.టి టెక్స్ట్ బుక్ లో అంబేడ్కర్, నెహ్రూ లపై ముద్రించబడిన కార్టూన్ పై పార్లమెంటులో గొడవ జరగడంతో ఇద్దరు ప్రొఫెసర్లు తమ సలహాదారు పదవులకు రాజీనామా చేశారు. యోగేంద్ర యాదవ్, సుహాస్ పాల్శికర్ లు సలహా దారుల కౌన్సిల్ నుండి తప్పుకున్నారని మానవ వనరుల శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. అంబేడ్కర్ కార్టూన్ పై లోక్ సభలో దళిత ఎం.పిలతో పాటు పలువురు ఎం.పి లు ఆందోళన చేయడంతో మానవ వనరుల మంత్రి కపిల్ సిబాల్ క్షమాపణ…

క్లుప్తంగా… 08.05.202

జాతీయం జ్యువెలర్స్ పన్ను ఉపసంహరించిన ప్రణబ్ నగల వ్యాపారుల ఒత్తిడికి ఆర్ధిక మంత్రి తలొగ్గాడు. జ్యువెలర్స్ వ్యాపారుల తరపున తీవ్ర స్ధాయిలో జరిగిన లాబీయింగ్ ముందు చేతులెత్తేశాడు. బ్రాండెడ్ మరియు అన్ బ్రాండెడ్ నగల దిగుమతులపై పెంచిన 1 శాతం పన్ను ఉపసంహరించుకున్నాడు. పన్ను ఉపసంహరణతో పాటు పన్ను పెంపు ప్రతిపాదిస్తూ చేసిన అనేక చర్యలను సరళీకరించాడని పత్రికలు తెలిపాయి. జ్యూవెలరీ రంగంలో విదేశీ పెట్టుబడుల ఆహ్వానాన్ని మరో సంవత్సరం పాటు వాయిదా వేసుకున్నట్లు కూడా తెలుస్తోంది.…

‘హజ్’ సబ్సిడీ రద్దు చేసిన సుప్రీం కోర్టు

‘హజ్’ యాత్రకు వెళ్ళే ముస్లిం ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ చెల్లించడాన్ని మంగళవారం సుప్రీం కోర్టు తప్పు పట్టింది. మరో పదేళ్ళలో ‘హజ్’ సబ్సిడీలను క్రమంగా రద్దు చేయాలని తీర్పు నిచ్చింది. మతపరమైన యాత్రలకు సబ్సిడీలు ఇవ్వడం ‘చెడ్డ మతాచారం’ గా అభివర్ణించింది. యాత్రీకులకు తోడు వెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం స్వయంగా అధికారిక డెలిగేషన్స్ పంపిస్తూ పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడం ద్వారా ‘హజ్’ యాత్ర ను రాజకీయం చేస్తున్నారని అభిప్రాయపడింది. “ఈ విధానాన్ని అంతం చేయాలని…

క్లుప్తంగా… 06.05.2012

జాతీయం భోపాల్ బాధితులకు మూడు నెలల్లో శుభ్రమైన నీళ్లివ్వండి -సుప్రీం కోర్టు భోపాల్ దుర్ఘటన జరిగి దాదాపు ముప్ఫై యేళ్ళు అవుతున్నా బాధితులు ఇప్పటికీ కాలుష్య పూరితమైన, క్యాన్సర్ కారక నీటినే తాగవలసి రావడం పట్ల సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు నెలల్లో వారికి పరిశుభ్రమైన నీరు తాగే సౌకర్యం కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. నిధులు లేకపోవడం కారణాలుగా చెప్పడానికి వీల్లేదనీ, ఆగస్టు 13 కల్లా నీటి సౌకర్యం కల్పించిన నివేదిక తనకి…

ఫ్రాన్సు ఎన్నికల్లో సర్కోజీ ఓటమి, స్వల్ప మెజారిటీతో హాలండే గెలుపు

ఫ్రాన్సు అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మితవాద పార్టీ ‘యు.ఎం.పి’ అభ్యర్ధి, అధ్యక్షుడు అయిన నికోలస్ సర్కోజీ ఓటమి చెందాడు. ఆయనపై ‘సోషలిస్టు’ పార్టీ అభ్యర్ధి ఫ్రాంకోయిస్ హాలండే స్వల్ప మెజారిటీతో గెలుపొందాడు. 95 శాతం ఓట్ల లెక్కింపు పూర్తికాగా వాటిలో హాలండేకి 51.6 శాతం ఓట్లు, సర్కోజీ కి 48.4 శాతం ఓట్లూ పోలయ్యాయి. కేవలం 3.2 శాతం ఓట్ల తేడాతో హాలండే గెలుపొందాడు. నికోలస్ సర్కోజీ విచక్షణా రహితంగా అమలు చేసిన ‘పొదుపు ఆర్ధిక…