నిరాయుధుడు లాడెన్‌ను హత్య చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం

కమెండోలు దిగుతుండగానే లాడెన్ భవంతి నుండి కాల్పులు ఎదురయ్యాయనీ, లాడెన్ సాయుధంగా ప్రతిఘటించడంతోనే కాల్చి చంపామనీ మొదట చెప్పిన అమెరికా అధికారులు మెల్ల మెల్లగా నిజాలను ఒక్కొక్కటీ వెల్లడిస్తున్నారు. లాడెన్ భార్య దాడి చేయడంతో అమెనూ కాల్చి చంపామని చెప్పినవారు ఇప్పుడు ఆమె లాడెన్‌కు అడ్డుగా రావడంతో కాలిపై కాల్చామనీ, అమె బతికే ఉందనీ ఇప్పుడు చెబుతున్నారు. హెలికాప్టర్లపై కాల్పులు జరిగాయన్నవారు ఇప్పుడు దానిగురించి మాట్లాడ్డం లేదు. లాడెన్ సాయుధంగా ప్రతిఘటించాడన్న వారు ఇప్పుడు అతను నిరాయుధంగానే…

లాడెన్‌ని అమెరికా చంపినట్టే అమెరికాలో చొరబడి ముంబై దాడి నిందితుడు హేడ్లీని చంపేద్దామా!?

వరల్డ్ ట్రేడ్ సెంటర్ కి చెందిన జంట టవర్లను కూల్పించి మూడు వేల మంది అమెరికన్లను చంపాడన్న ఆరోపణపై ఒసామా-బిన్-లాడెన్ ను పాకిస్ధాన్‌కి చెప్పకుండా అతని ఇంటిపై దాడి చేసి చంపింది. “దాడి సంగతి మాకు తెలియదు” అని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్ధాన్ ప్రభుత్వానికి చెబితే ఒసామాను తప్పించవచ్చన్న అనుమానంతో వాళ్ళకి చెప్పలేదని సి.ఐ.ఏ డైరెక్టర్ టైమ్స్ మేగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టాడు. “మీ అబ్బాయిని చంపినవాడు మాయింట్లో దాచిపెడితే ఏం చేస్తావు? నా…

ప్రపంచ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన లాడెన్ మృతి, పైశాచికానందంలో దురాక్రమణ గుంపు

ఒసామా బిన్ లాడెన్‌ను ఎట్టకేలకు దురాక్రమణదారులు చంపగలిగారు. రెండు అగ్ర రాజ్యాల దురాక్రమణలను ఎదిరించి పోరాడిన బిన్ లాడేన్ హీరోచిత మరణం పొందాడు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కి చెందిన జంట టవర్లపై విమానాలతో డీకొట్టి కూల్చడం వెనక బిన్ లాడేన్ పధకం ఉందని యుద్ధోన్మాదుల మానస పు(ప)త్రికలు చేసిన ప్రచారంతో రెండు మదపుటేనుగులతో కలబడిన లాడెన్ ప్రతిష్ట తాత్కాలికంగా మసకబారవచ్చు. అచ్చోసిన ఆంబోతుల్లా ప్రపంచంపై బడి దేశాల సంపదలనన్నింటినీ కొల్లగొట్టే దుష్టబుద్ధితో వెంపర్లాడే అమెరికా నాయకత్వంలోని…

గడ్దాఫీని చంపడానికి మళ్ళీ నాటో దాడి, కొడుకు ముగ్గురు మనవళ్ళు మృతి

గడ్డాఫీని చంపడానికే కంకణం కట్టుకున్న నాటో దేశాలు మరోసారి లిబియా అధ్యక్షుడు గడ్డాఫీ నివాస సముదాయంపై మిసైళ్ళతో దాడి చేశాయి. దాడినుండి గడ్డాఫీ తప్పించుకున్నప్పటికీ చిన్న కొడుకు సైఫ్ ఆల్-అరబ్ తో పాటు ముగ్గురు మనవళ్ళు చనిపోయినట్టు లిబియా ప్రభుత్వం తెలిపింది. భవనంపై కనీసం మూడు మిసైళ్ళు ప్రయోగించారనీ, దాడిలో భవనం పూర్తిగా దెబ్బతిన్నదనీ లిబియా ప్రభుత్వ ప్రతినిధి మౌసా ఇబ్రహీం తెలిపాడు. దాడి జరిగిన కొద్ది గంటల్లోనే నాటో ప్రతినిధి ఛార్లెస్ బౌచర్డ్ వివరణ ఇవ్వడానికి…

దురాక్రమణ సేనలపై వేసవి దాడులు మొదలుపెడతాం -తాలిబాన్

ఆఫ్ఘనిస్ధాన్‌ని ఆక్రమించిన అమెరికా, తదితర పశ్చిమ దేశాల దురాక్రమణ సేనలపై ఆదివారం నుండి తాజా దాడులు ప్రారంభిస్తున్నామని తాలిబాన్ ప్రకటించింది. దురాక్రమణ సేనలు, వారి గూఢచారులు, దురాక్రమణ దేశాల తొత్తు ప్రభుత్వ అధికారులు, వారి సైనికులపై దాడులు చేస్తామని తాలిబాన్ ప్రకటించింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ జోడు టవర్లను విమానాలతో కూల్చింది ఆల్-ఖైదా మిలిటెంట్లేనని నిశ్చయించుకున్న అమెరికా ఆల్-ఖైదాని అంతమొందించే పేరుతో ఆఫ్ఘనిస్ధాన్ పై దురాక్రమణదాడి చేసిన సంగతి విదితమే. ఆల్-ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్…

గాజా సరిహద్దును శాశ్వతంగా తెరవడానికి నిర్ణయించిన ఈజిప్టు

అరబ్ ప్రజా ఉద్యమాలకు మరో బోనస్. ఈజిప్టులోని మధ్యంతర ప్రభుత్వం గాజాతో ఉన్న రఫా సరిహద్దును శాశ్వత ప్రాతిపదికన తెరిచి ఉంచడానికి నిర్ణయించింది. పాలస్తీనా వైరి పార్టీల మధ్య ఊహించని విధంగా ఒప్పందం కుదరడానికి సహకరించిన ఈజిప్టు ప్రభుత్వం గాజా సరిహద్దును తెరవాలని నిర్ణయించడం అభినందనీయం. అయితే అరబ్ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్‌తో కొనసాగుతున్న (అ)శాంతి ఒప్పందం కూడా రద్ధు చేసుకుంటే ఈజిప్టు ప్రభుత్వానికి ప్రపంచవ్యాపితంగా ప్రశంసలు అందుతాయి. కానీ అమెరికానుండి సంవత్సరానికి 1 బిలియన్…

అరబ్ ప్రజా ఉద్యమాలకు బోనస్, పాలస్తీనా వైరివర్గాల మధ్య శాంతి ఒప్పందం

ఈజిప్టు, ట్యునీషియాలలో నియంతలను తరిమికొట్టిన ప్రజా ఉద్యమాలు తమవరకు పూర్తి విజయం సాధించలేక పోయినా, తమ పొరుగు అరబ్బులు పాలస్తీనీయుల మధ్య శుభప్రదమైన శాంతి ఒప్పందం కుదరడానికి దోహదపడ్దాయి. ఇజ్రాయెల్ దురాక్రమణలో ఉన్న పాలస్తీనాకు స్వతంత్రం సాధించడానికి పోరాడుతున్న ఫతా, హమాస్ పార్టీల మధ్య తీవ్ర వైరం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈజిప్టులో ఏర్పడిన మద్యంతర ప్రభుత్వం మధ్యవర్తిత్వంతో వైరి పక్షాల మధ్య సంబంధాలు మెరుగుపడే దిశలో ప్రయత్నాలు మొదలయ్యాయి. దానిలో మొదటి అడుగుగా ఇరుపక్షాలూ సహకరించుకోవడానికి…

అంతర్జాతీయ ఒత్తిడితో దారుణ నరకంనుండి బైటపడ్డ అమెరికా ఖైదీ “బ్రాడ్లీ మేనింగ్”

ప్రపంచ దేశాలపై తన ప్రయోజనాల కోసం బాసిజం చేసే అమెరికా, బహుశా మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ ఒత్తిడికి, విమర్శలకు లొంగింది. దాదాపు తొమ్మిది నెలల నుండి సొంత దేశీయుడినే నరక బాధలు పెడుతున్న జైలు అధికారులు విచారణా ఖైదీ “బ్రాడ్లీ మేనింగ్”ని సాలిటరీ కనఫైన్‌మెంట్ సెల్ నుండి బైటకు అనుమతించింది. వికీలీక్స్ ఛీఫ్ ఎడిటర్ జులియన్ అస్సాంజ్ కి ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ యుద్ధాలకు సంబంధించిన డాక్యుమెంట్లను, యాభై సంవత్సరాల డిప్లొమాటిక్ కేబుల్స్ ను లీక్ చేశాడన్న ఆరోపణలపై బ్రాడ్లీ…

గడ్డాఫీని టార్గెట్ చేయాలంటున్న బ్రిటన్, చట్టవిరుద్ధమని లాయర్ల హెచ్చరిక

“లిబియా ప్రభుత్వ కమాండ్ అండ్ కంట్రోల్ (గడ్డాఫీ) ను టార్గెట్ చెయ్యడం చట్టబద్ధమే” అని బ్రిటన్ డిఫెన్స్ సెక్రటరీ లియామ్ ఫాక్స్ ప్రకటించాడు. అయితే “గడ్డాఫిపైన గానీ, లిబియా ప్రభుత్వ సైన్యంపైన గానీ దాడుల చేయడానికీ, లిబియా తిరుగుబాటుదారులకు ట్రైనింగ్ ఇవ్వడానికీ ఐక్యరాజ్య సమితి తీర్మానం అనుమతి ఇవ్వలేదు. అలా చేస్తే చట్ట విరుద్ధం” అని బ్రిటన్ ప్రభుత్వ లాయర్లు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్ ప్రధాని కామెరూన్ కూడా లిబియా తిరుగుబాటుదారులకు ఆయుధాలిచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని తమ ఎం.పిలకు…

ఇరాక్ ప్రభుత్వ హత్యాకాండకు స్పందించని అమెరికా, యూరప్‌లు

ఇరాక్‌లోని అష్రాఫ్ క్యాంపులో నివసిస్తున్న పౌరులపై ఏప్రిల్ 8 తేదీన ఇరాక్ ప్రభుత్వ సైనికులు విరుచుకుపడి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 34 మంది మరణించారు. ఆ తర్వాత విడుదలైన వీడియో ద్వారా ఇరాస్ సైన్యం ఉద్దేశ్యపూర్వకంగానే క్యాంపుపై దాడి చేసి కాల్పులు జరిపిందని స్పష్టమయ్యింది. సైనికులు తాపీగా పౌరులపై కాల్పులు జరపడం, తమ వాహనాలను వారిమీదుగా నడపడం వంటివన్నీ చూసిన వారికి అక్కడ ఉన్నవారిని చంపడానికే సైనికులు కాల్పులు జరిపారని స్పష్టమవుతుంది. ఈ ఘటన పట్ల…

బాంబుదాడిలో ఆఫ్ఘన్ ఆల్-ఖైదా నెం.2 మరణం -నాటో దురాక్రమణ సేనలు

అమెరికా నాయకత్వంలోని దురాక్రమణ సేనలు ఆఫ్ఘనిస్ధాన్ ఆల్-ఖైదా నెం.2 నాయకుడిని బాంబు దాడిలో చంపేశామని ప్రకటించాయి. ఆఫ్ఘనిస్ధాన్ లోని కూనార్ రాష్ట్రంలో రెండు వారాల క్రితం జరిపిన బాంబు దాడిలో ఆఫ్ఘనిస్ధాన్‌కి చెందిన ఆల్-ఖైదా సంస్ధకు నెం.2 నాయకుడిగా పేర్కొనదగ్గ “అబ్దుల్ ఘనీ” చనిపోయాడని అమెరికా నాయకత్వంలోని నాటో సేనలు తెలిపాయి. ఇతనిని అబు హాఫ్స్ ఆల్-నజ్ది అన్న పేరుతో కూడా సంబోధిస్తారు. సౌదీ అరేబియా దేశానికి చెందిన ఘనీ అనేక మంది అమెరికా సైనిక అధికారుల…

ది గ్రేట్ ఎస్కేప్: అమెరికా భద్రతా వ్యవస్ధను హేళన చేస్తూ 488 తాలిబాన్ ఖైదీల పరారీ

ఆఫ్ఘనిస్ధాన్‌లో అమెరికా సైన్యం, దాని తొత్తు ప్రభుత్వం ఖైదు చేసిన కాందహార్ జైలునుండి 488 మంది తాలిబన్ ఖైదీలు పరారయ్యారు. ఐదు నెలలపాటు తవ్వీన్ సొరంగం ద్వారా, డూప్లికేట్ తాళాలను ఉపయోగించి వీరు పరారయ్యారు. సర్పోజా జైలుగా పిలిచే ఈ జైలునుండి తాలిబాన్లు పరారు కావడం ఇది రెండో సారి. 2008 సంవత్సరంలో వెయ్యిమందికి పైగా ఖైదీలు ప్రధాన ద్వారం నుండే పరారయ్యారు. ఆ సంఘటన తర్వాత అమెరికా కాందహార్ జైలుకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది.…

టిబెటన్లపై కొనసాగుతున్న చైనా ప్రభుత్వ అణచివేత చర్యలు

టిబెటన్లపై చైనా ప్రభుత్వ అణచివేత చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా పశ్చీమ్ చైనాలోని బౌద్దుల మొనాస్టరీపై చైనా పోలీసులు దాడి చేశారు. పోలీసుల దాడిలో ఇద్దరు టిబెట్ వృద్ధులు చనిపోయారు. కృతి మొనాస్టరీ పై దాడి చేసిన పోలీసులు అక్కడ ఉన్న బౌద్ధ మత గురువులను అరెస్టు చేయకుండా అడ్డుకున్న ఒక వృద్ధుడు, మరో వృద్ధురాలు పోలీసుల బలప్రయోగంలో చనిపోయారు. “ఇంటర్నేషనల్ కాంపెయిన్ ఫర్ టిబెటన్స్‌” (ఐ.సి.టి) సంస్ధ ఈ విషయం తెలియజేసింది. మార్చి 16 న టిబెట్…

మిస్రాటాను కాపాడండి, లేదా మేమే కాపాడుకుంటాం! లిబియా ఆర్మీకి గిరిజన తెగల అల్టిమేటం

లిబియాలో తిరుగుబాటుదారులకూ, ప్రభుత్వ సైనికులకూ జరుగుతున్న తీవ్రమైన పోరు కొత్త మలుపు తిరిగింది. “మిస్రాటా పట్టణం నుండి తిరుగుబాటుదారుల్ని ప్రభుత్వ సైన్యం వెళ్ళగొట్టలేకపోతే చెప్పండి. మేమే అందుకు పూనుకుంటాం” అని స్ధానిక గిరిజన తెగలు అల్టిమేటం ఇచ్చాయని ఉప విదేశాంగ మంత్రి ఖలేద్ కైమ్ ను ఉటంకిస్తూ బిబిసి తెలిపింది. “ఇకనుండి మిస్రాటాలో పరిస్ధితిని అక్కడ నివాసం ఉంటున్నవారు, చుట్టుపక్కల గిరిజన తెగల ప్రజలు ఎదుర్కొంటారు. ప్రభుత్వ సైన్యం ఆ భాధ్యతనుండి విరమించుకుంటుంది. వారు తిరుగుబాటుదారులతో చర్చలు…

మిస్రాటా శరణార్ధి నౌకలు, పశ్చిమ దేశాల అబద్ధపు ప్రచారానికి సాక్ష్యం

లిబియా యుద్ధం ఎందుకు వచ్చిందంటే చాలామంది చెప్పే సమాధానం “గడ్డాఫీ సైన్యాలు లిబియా పౌరులపై దాడులు చేస్తూ చంపడం వలన” అని. అరబ్ దేశాల్లో ప్రజాస్వామిక హక్కుల కోసం ఉద్యమాలు చెలరేగుతున్నాయనీ, దానిలో భాగంగానే లిబియాలొ కూడా ప్రజాస్వామిక ఉద్యమం మొదలైందనీ, కానీ ఉద్యమాన్ని లిబియా నియంత గడ్డాఫీ సైనిక బలంతో అణచివేయడానికి లిబియా పౌరులను చంపుతుండడం వలన అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ ల నాయకత్వంలో కొన్ని దేశాలు లిబియా పై “నిషిద్ధ గగనతలం” అమలు చేయడానికి…