బి.జె.పి నోట సెక్యులరిజం మాట
దేశంలో సెక్యులరిస్టు శక్తులకు నిరాశ కలిగించే పరిణామాలు జరుగుతున్నాయంటూ భారతీయ జనతా పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అది కూడా ఒక ముస్లిం వ్యక్తిని ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా తొలగించినందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన తొలగింపు దేశంలోని సెక్యులరిస్టు శక్తులకు నిరాశను కలిగించిందని వాపోయింది. లక్నోలోని దారుల్ ఉలూమ్‌కు మొహతామిమ్ (వైస్ ఛాన్సలర్)గా జనవరిలో నియమితుడయిన మౌలానా గులామ్ మొహమ్మద్ వాస్తన్విని తొలగిస్తూ యూనివర్సిటీ గవర్నింగ్ బాడీ ఐన మజ్లిస్-ఎ-షూరా ఆదివారం నిర్ణయం తీసుకుంది.…