మూడో వంతు లిబియా ఆయిల్ ఫ్రాన్సు కైవశం, మిగిలింది బ్రిటన్, ఇటలీ, అమెరికాలకు?

ఫ్రాన్సు కష్టానికి ఫలితం దక్కుతోంది. లిబియాలో తిరుగుబాటు ప్రారంభమైన మరుసటిరోజే తూర్పు పట్టణం బెంఘాజీ కేంద్రంగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వాన్ని లిబియాకు అసలైన ప్రభుత్వంగా ఫ్రాన్సు మొట్టమొదటిసారిగా గుర్తించింది. అందుకు తగిన విధంగా లిబియా తిరుగుబాటు ప్రభుత్వం “నేషనల్ ట్రాన్సిషనల్ కౌన్సిల్” (ఎన్.టి.సి) బదులు తీర్చుకుంటోంది. లిబియా ఆయిల్ వనరుల్లో మూడోవంతు భాగాన్ని ఫ్రాన్సు ఆయిల్ కంపెనీ టోటల్ కి అప్పజెప్పడానికి ఫ్రాన్సు లిబియాతో ఒప్పందం సంపాదించింది. ఫ్రెంచి డెయిలీ పత్రిక లిబరేషన్ ఈ మేరకు గురువారం…

ఇజ్రాయెల్ రాయబారిని బహిష్కరించిన టర్కీ

మధ్య ప్రాచ్యం (Middle East) లో గత రెండు మూడు సంవత్సరాలుగా వినూత్న కదలికలతో పత్రికల పతాక శీర్షికలను ఆక్రమించిన టర్కీ తాజాగా మరొక చర్య తీసుకుంది. ఇజ్రాయెల్ రాయబారిని టర్కీ నుండి బహిష్కరించింది. ఇకనుండి ఇజ్రాయెల్‌తో రెండవ స్ధాయి సెక్రటరీ స్ధాయిలోనే సంబంధాలు ఉంటాయని తెలిపింది. ఇజ్రాయెల్ సైన్యం చుట్టుముట్టిన పాలస్తీనా ప్రాంతం గాజాకు మానవతాసాయాన్ని టర్కీ నుండి తీసుకెళ్తున్న ఓడల కాన్వాయ్ పైన గత సంవత్సరం సైనికులతో అమానుషంగా దాడి చేసి తొమ్మిందిని చంపేసిన…

ధియేటర్ పేలుడు కేసులో హిందూ సంస్ధ సబ్యులకు 10 సం.ల జైలు శిక్ష

హిందూత్వ సంస్ధ ‘సనాతన్ సంస్ధ’ తో సంబంధాలున్నాయని భావిస్తున్న ఇద్దరు వ్యక్తులకు సినిమా ధియేటర్ లో బాంబులు పెట్టి పేల్చారన్న నేరానికి కోర్టు పది సంవత్సరాల సాధారణ జైలు శిక్ష విధించింది. 2008లో జరిగిన మూడు ధియేటర్ల పేలుడు సంఘటనలలో రెండింటిలో నిందుతులు పాలు పంచుకున్నట్లుగా రుజువయ్యింది. పేలుళ్ళలో ఏడుగురు గాయపడ్డారు. నిందితులకు నేర చరిత్ర లేకపోవడం, మధ్య తరగతికి చెందినవారు కావడంతో తక్కువ శిక్షతొ సరిపెడుతున్నట్లు కోర్టు తెలిపింది. మహారాష్ట్ర ప్రభుత్వ యాంటి టెర్రరిస్టు స్క్వాడ్…

నేను అన్నాను కాలేను -అరుంధతీ రాయ్ (అనువాద వ్యాసం) -2

‘ప్రజలు’ అంటే జన్ లోక్ పాల్ బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టి, ఆమోదించకుంటే చివరికంటా నిరాహార దీక్ష చేసి చనిపోతానని ఒక 74 ఏళ్ళ వ్యక్తి కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరిస్తున్న దృశ్యాన్ని వీక్షించడానికి జమ కూడినవారు మాత్రమే. ఆకలిగొన్నవారికోసం చేపలు, రొట్టెలను యేసు క్రీస్తు అనేక రెట్లు పెంచిన పద్ధతిలో, టి.వి ఛానెళ్ళు తమ అద్భుత మాయాజాలంతో మిలియన్లకు పెంచగలిగన పదుల వేల మంది మాత్రమే ప్రజలు. “ఒక బిలియన్ మంది (వంద కోట్లు) ఒకే గొంతుకతో ‘ఇండియాయే…

ఏదో ఒకటి రూపొందించి ‘జన్ లోక్ పాల్’ బిల్లు అనండి, అంతా ఒప్పుకుంటారు -అద్వానీ

భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకుడు ఎల్.కె.అద్వానీ జన్ లోక్ పాల్ కావాలంటున్న అన్నా బృందం, ఆయన ఇతర మద్దతుదారుల డిమాండ్ కు కొత్త భాష్యం చెప్పాడు. జన్ లోక్ పాల్ బిల్లు మాత్రమే అంగీకారయోగ్యం అంటున్న వారు చిన్నబుచ్చుకునేలా అద్వాని వ్యాఖ్యలు ఉన్నాయి. శుక్రవారం తన నివాసం వద్ద తనను కలిసిన ఐ.ఐ.టి విద్యార్ధులతో మాట్లాడుతూ అద్వానీ లోక్ పాల్ బిల్లు గురించి కొన్ని విషయాలు చర్చించాడు. జన్ లోక్ పాల్ బిల్లులో కొన్ని ప్రాధమికమైన…

మా మూడు డిమాండ్లు ఒప్పుకుంటే దీక్ష విరమిస్తా -ప్రధానికి అన్నా లేఖ

శుక్రవారం అన్నా హజారే ప్రధానికి మరొక లేఖ రాశాడు. తమ మూడు కీలక డిమాండ్లను అంగీకరిస్తే దీక్ష విరమిస్తానని ప్రకటించాడు. సివిల్ సర్వెంట్లు అంతా లోక్ పాల్ చట్టం పరిధిలోకి తేవాలి; అన్ని ప్రభుత్వ కార్యాలయాలలోనూ ‘సిటిజన్ చార్టర్’ ను ప్రదర్శించాలి; అన్ని రాష్ట్రాలూ లోకాయుక్త ను నియమించుకోవాలి. ఈ మూడు డిమాండ్ల తీర్మానాన్ని పార్లమెంటు ఆమోదించాలని అన్నా కోరాడు. డిమాండ్లు అంగీకరించడంతో సరిపెట్టకుండా ఆ మేరకు చట్టాన్ని ఆమోదిస్తేనే దీక్ష విరమిస్తానని అన్నా తెలిపాడు. “ఈ…

హజారే పరిస్ధితిని పరిశీలిస్తున్నాం -అమెరికా

అన్నా హాజారే, ఆయన నిరాహార దీక్ష పరిస్ధితులను పరిశీలిస్తున్నామని అమెరికా మరోమారు ప్రకటించింది. హజారేకు మద్దతుగా కొద్ది రోజుల క్రితం ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ హజారే దీక్షకు అమెరికా మద్దతు ఉందేమోనని అనుమానం వ్యక్తం చేసింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటినుండి ఇంతవరకూ ఇండియా అంతర్గత వ్యవహారాల్లో అమెరికా కలగజేసుకున్నది లేదనీ, మొదటిసారిగా హజారే దీక్షను భారత ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతుల్లో పరిష్కరించాలని ప్రకటించడంతో హజారే దీక్ష, ఉద్యమానికి అమెరికా మద్దతు ఉన్నట్లు భావించవలసి వస్తున్నదనీ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.…

జగన్ అవినీతికి మద్దతుగా రాజీనామాలు

దేశమంతా అన్నా హజారే అందిస్తున్న స్ఫూర్తితో అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లో పరిస్ధితి అందుకు భిన్నంగా ఉంది. అవినీతికి మద్దతుగా 29 మంది ఎం.ఎల్.ఎ లు ఏకంగా రాజీనామాకే సిద్ధపడ్డారు. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులు విషయంలో హైకోర్టు ఆదేశాల మేరకు సి.బి.ఐ జగన్ కి చెందిన అనేక స్ధావరాలపై గత రెండు రోజులుగా దాడులు చేస్తుండడంతో, జగన్ వేసిన ఎత్తుగడ ఇది. రాజీనామాల ఎత్తుగడతో జగన సాధించేదీ ఏమిటో అర్ధం కావడం లేదు. బహుశా ఉప…

కమ్యూనిస్టు విప్లవకారుల అవగాహనకు దగ్గరలో అన్నా హజారే ప్రసంగాలు

పౌర సమాజ నాయకుడుగా ఆవిర్భవించిన గాంధేయవాది అన్నా హజారే శక్తివంతమైన లోక్‌పాల్ బిల్లుకోసం అయిదు రోజుల నుండి నిరాహార దీక్ష చేస్తుండడమే కాక మధ్య మధ్యలో ప్రసంగాలు కూడా చేస్తున్నాడు. నిరాహార దీక్ష ప్రారంభం అయినప్పటినుండీ అన్నా చేస్తున్న ప్రసంగాలు కమ్యూనిస్టు విప్లవకారులుగా ఉన్న పార్టీల అవగాహనకు సమీపంలో ఉన్న సంగతి గమనార్హం. సి.పి.ఐ (ఎం.ఎల్ – మావోయిస్టు), సి.పి.ఐ (ఎం.ఎల్ – న్యూడెమొక్రసీ), సి.పి.ఐ (ఎం.ఎల్ – జనశక్తి) తదితర పార్టీలు భారత దేశంలో విప్లవ…

హజారేకు అమెరికా మద్దతు వెనక ఆంతర్యం ఏమిటి? కాంగ్రెస్ అనుమానం

బుధవారం కాంగ్రెస్ పార్టీ ఒక ముఖ్యమైన ప్రశ్నను సంధించింది. అన్నా హజారే శాంతియుత నిరసన దీక్ష పట్ల భారత ప్రభుత్వం తగువిధంగా ప్రజాస్వామ్యబద్ధమైన సంయమనం పాటిస్తుందని ఆశిస్తున్నామని కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. అమెరికా తన వొంటి నలుపుని పక్కనబెట్టి నలుపు మచ్చల్ని వెతకడానికి ప్రయత్నించడం మామూలు విషయం. ప్రపంచ దేశాల్లో తన రాయబార కార్యాలయాల్ని గూఢచర్యానికి కేంద్రాలుగా మార్చిన వైనాన్ని బైటపెట్టిన అమెరికా సైనికుడు బ్రాడ్లీ మేనింగ్ ని చీకటి కొట్టంలో పడేసి చిత్ర హింసలు…

బారక్ ఒబామా: నాడు, నేడు -కార్టూన్

2008 లో అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల కాలానికి ఒక్కసారి వెళితే… ఒబామా అధ్యక్ష ఎన్నికల ప్రచారం నిమిత్తం ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నీరాజనాలు పట్టారు. అర్ధం లేని రెండు దురాక్రమణ యుద్ధాలతో అమెరికాపై రుణ భారం పెంచుతూ పోయిన జార్జి బుష్ పాలన పట్ల అమెరికన్లు విసిగిపోయి ఉన్నారు. తనను గెలిపిస్తే ఆఫ్ఘన్, ఇరాక్ లనుండి సైన్యాన్ని వెనక్కి రప్పిస్తానని నమ్మ బలికాడు. ముస్లిం ప్రపంచంతో సంబంధాలు మెరుగుపరుచుకుంటానన్నాడు. ఇరాన్, రష్యా లతో కొత్త రకం…

తలొగ్గిన ప్రభుత్వం, అన్నా హజారే దీక్షకు అనుమతి, జె.పి.పార్క్‌లో దీక్ష (అప్‌డేట్స్ తో)

అప్ డేట్ (2): యోగా గురు రాందేవ్, ఆర్ట్ ఆఫ్ లిగింగ్ ఫౌండేషన్ శ్రీ శ్రీ రవి శంకర్ లు కూడా తీహార్ జైలు బయట ఉన్న నిరసనకారులతో జత కలిసారు. రవి శంకర్, జైలు లోపలకి వెళ్ళి హజారేని కలిసినట్లు తెలుస్తోంది. అంతకుముందు బాబా రాందేవ్ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ని కలిసి హజారే అరెస్టుకి వ్యతిరేకంగా మెమొరాండం ఇచ్చాడు. నిరసనకారులను ఉద్దేశించి మాట్లాడుతూ రాందేవ్, ప్రజాస్వామ్యం పేరుతో ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆరోపించాడు. అప్…

ఆగష్టు 15 న రాజ్‌ఘాట్ వద్ద అన్నా హజారే దీక్ష -ఫొటోలు

ఆగష్టు 15, 2011 తేదీన అన్నా హజారే తలవని తలంపుగా గాంధీ సమాధి వద్ద ప్రత్యక్షమయ్యారు. ముందుగా సమాచారం లేని సందర్శన కావడంతో పోలీసులు తొలుతు హడావుడి పడినా తర్వాత సర్దుకున్నారు. నిరవధిక నిరాహార దీక్షకు కూర్చుంటానని చాలా రోజుల్నిండి హెచ్చరిస్తూ వస్తున్న అన్నా హజారే రాజ్ ఘాట్ వద్ద ఆపని చేయడానికి వచ్చాడేమో నని పోలీసులు కంగారు పడ్డారని తెలిసింది. స్వతంత్రం భారతంలో నాయకుల అవినీతి పెచ్చుమీరడం పట్ల తన ప్రార్ధనలో ఆవేదన చెందానని ఆయన…

అన్నా హజారే అరెస్టు, నిర్బంధంలోనే నిరవధిక నిరహార దీక్ష ప్రారంభం

అంతా అనుకున్నట్లుగానే జరుగుతోంది. అవినీతిపై తన పద్ధతిలో సమర శంఖం పూరించిన అన్నా హజారేను నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నట్లు ప్రకటించకముందే అరెస్టు చేశారు. 74 ఏళ్ళ అన్నా హజారేను 7:30 గంటలకే ఆయన ఉంటున్న  తూర్పు ఢిల్లీలోని అపార్ట్‌మెంటుకి వెళ్ళి అరెస్టు చేశారు. మొదట దీక్ష విరమించాలని నచ్చజెప్పిన పోలీసు అధికారులు, అందుకాయన ససేమిరా అనడంతో అరెస్టు చేయక తప్పలేదని తెలిపారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించి వేలమంది మద్దతుదారులతో దీక్షకు కూర్చుంటున్నానని హజారే చెప్పినందున ముందస్తు జాగ్రత్తగా…

అమెరికన్లను ఇబ్బంది పెట్టడం ఆపాలని పాక్‌ని కోరిన అమెరికా

పాకిస్దాన్ లో ఉన్న అమెరికన్లను ఇబ్బంది పెట్టడం (harassment) ఆపాలని అమెరికా కోరింది. అమెరికా రాయబారుల కదలికలపై పాకిస్ధాన్ ప్రభుత్వం విధించిన ఆంక్షలను కూడా ఎత్తివేయాలని కూడా అమెరికా పాక్ ప్రభుత్వాన్ని కోరింది. లాహోర్ లో నివసిస్తున్న ఒక అమెరికన్‌ను తుపాకులు ధరించిన కొద్దిమంది కిడ్నాప్ చేసిన అనంతరం ఈ విజ్ఞప్తులు అందాయి. అమెరికా సీనియర్ సెనేటర్ జాన్ మెక్‌కెయిన్ (ఒబామాతో అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిన రిపబ్లికన్) పాకిస్ధాన్ సైన్యం అధిపతి జనరల్ అష్‌ఫాక్…