శత సహస్ర కోటీశ్వరుడు సుబ్రతో రాయ్ అరెస్ట్

సహారా గ్రూపు కంపెనీల అధినేత సుబ్రతో రాయ్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. సుప్రీం కోర్టులో హాజరు కావాలన్న కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడంతో సుప్రీం కోర్టు రెండు రోజుల క్రితం నాన్ బెయిలబుల్ అరెస్టు వారంటు జారీ చేసింది. సుబ్రతో రాయ్ కోసం ఆయనకు చెందిన లక్నో నివాసంలో పోలీసులు వెతికినప్పటికి దొరకలేదు. సుబ్రతో కంపెనీల వద్దా, నివాసాల వద్దా పోలీసులు కాపు కాయడంతో పరిస్ధితి తీవ్రతను గమనించిన రాయ్ ఈ రోజు లక్నో…

సహారా బాస్ కి నాన్ బెయిలబుల్ వారంట్

సహారా గ్రూపు కంపెనీల అధినేత, క్రికెట్ ఇండియా టీం మాజీ స్పాన్సరర్ అయిన సుబ్రతో రాయ్ కి సుప్రీం కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంటు జారీ చేసింది. వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరుతూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ ను కోర్టు కొట్టివేసినప్పటికీ కోర్టుకు రాకపోవడంపై సుప్రీం ద్విసభ్య బెంచి ఆగ్రహం వ్యక్తం చేసింది. తల్లిగారి ఆరోగ్యం బాగాలేనందున హాజరు కాలేకపోయారన్న సుబ్రతో రాయ్ అడ్వకేట్, సో కాల్డ్ పేరు మోసిన క్రిమినల్ లాయర్…

రేపిస్టు అ(వ)సరం కోసం బాలికకు జబ్బు అంటగట్టిన జేఠ్మలాని

భారత దేశ న్యాయ వ్యవస్ధ ఎంత గబ్బు పట్టిందో రాం జెఠ్మలానీ రుజువు చేశాడు. దేశంలోనే అతి భారీ క్రిమినల్ లాయర్ గా పేరు మోసిన ఈ పెద్ద మనిషి తన రేపిస్టు క్లయింటు కోసం ఒక నిస్సహాయ పేద బాలికకు బహుశా వైద్య శాస్త్రానికి కూడా తెలియని జబ్బు అంటగట్టాడు. ఈ పేరు మోసిన క్రిమినల్ లాయర్ క్రిమినల్ డాక్టర్ గా కూడా అవతరించి అమ్మాయిల్ని ఒంటరిగా ఉండే ముసలి ముదురు పీనుగలవైపుకి ఆకర్షించే సరికొత్త…

రాముడు చెడ్డ బాలుడు -రాం జేఠ్మలాని

‘రాముడు మంచి బాలుడు’ అని చదవడమే ఇప్పటిదాకా మనకున్న అలవాటు. ఇకనుండి ‘రాముడు చెడ్డవాడు’ అనికూడా చదువుకోవచ్చు. బి.జె.పి రాజ్యసభ సభ్యుడు, జగన్ బెయిల్ కోసం తీవ్రంగా శ్రమించి విఫలం అయిన ప్రముఖ సుప్రీం కోర్టు లాయర్ రాం జేఠ్మలాని భారత ప్రజలకు ఆ అవకాశాన్ని కల్పించాడు. ఏ కారణంతో అయితే ఇన్నాళ్లూ ఆయన్ని నెత్తిన పెట్టుకున్నారో సరిగ్గా అదే కారణంతో రాముడు తాజాగా చెడ్డవాడు కావడమే ఓ ఆసక్తికర పరిణామం. స్త్రీ, పురుషుల మధ్య సంబంధాలపై…