సరబ్ జిత్ లాగే మాకూ డబ్బివ్వాలి, కోర్టుకు గూఢచారుల మొర

ఇంతకీ సరబ్ జిత్ సింగ్ ఎవరు? పాకిస్ధాన్ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లు టెర్రరిస్టా? ఆయన కుటుంబం చెబుతున్నట్లు తాగి ఏమి చేస్తున్నాడో, ఎటు  వెళుతున్నాడో తెలియని అమాయక తాగుబోతా? భారత ప్రభుత్వం సొంతం చేసుకోలేని గూఢచారా? భారత పత్రికలు సరబ్ జిత్ సింగ్ గురించి అతని కుటుంబ సభ్యులు చెప్పిన ‘అమాయక తాగుబోతు’ కధని వల్లించినప్పటికీ బి.బి.సి, సి.ఎన్.ఎన్ లాంటి పశ్చిమ దేశాల పత్రికలు ఆయనను భారత గూఢచారి అనే సంబోధిస్తూ వచ్చాయి. ది హిందు పత్రిక ఆదివారం…

ఫోన్లు, ఈ-మెయిళ్ళు ట్యాప్ చెయ్యడానికి అనుమతి పొందిన ‘రా’

పాకిస్ధాన్ కి ఐ.ఎస్.ఐ ఉన్నట్లే, ఇండియాకి కూడా ఓ గూఢచార సంస్ధ ఉంది. దాని పేరు ‘రీసర్చ్ అండ్ అనాలసిస్ వింగ్’. దీన్ని సంక్షిప్తంగా ఆర్.ఎ.డబ్ల్యు లేదా ‘రా’ అని పిలుస్తారు. ఇది ప్రధానంగా పాకిస్ధాన్, చైనా విషయాల్లో చురుకుగా పని చేస్తుంటుంది. దీనికి ఇప్పుడు భారతీయులు చేసే ఫోన్ కాల్స్, ఈ-మెయిళ్ళు, ఇంకా ఇతరేతర డేటా కమ్యూనికేషన్లు అన్నింటినీ దొంగచాటుగా వినే అధికారం చట్టపరంగా దక్కింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం…