రష్యాలో విలీనానికి క్రిమియా పార్లమెంటు ఆమోదం

పశ్చిమ రాజ్యాల తెరవెనుక మంతనాలను వెక్కిరిస్తూ క్రిమియా పార్లమెంటు రష్యాలో విలీనం చెందడానికి ఆమోదం తెలిపింది. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత (Teritorial Integrity) ను రష్యా ఉల్లంఘించిందని ఆరోపిస్తూ అమెరికా, ఇ.యులు ఒకవైపు రష్యాపై ఆంక్షల బెదిరింపులు కొనసాగిస్తుండగానే క్రిమియా పార్లమెంటు తన పని తాను చేసుకుపోయింది. 1954లో సోవియట్ హయాంలో ఉక్రెయిన్ కు కానుకగా ఇవ్వబడిన క్రిమియా ఇప్పుడు మళ్ళీ స్వస్ధలం చేరడానికి రంగం సిద్ధం అయింది. మార్చి 16 తేదీన జరగబోయే రిఫరెండంలో ప్రజలు…

ఉక్రెయిన్: రష్యా సేనలు వెనక్కి, అమెరికాతో ఒప్పందం?

తూర్పు ఉక్రెయిన్ సరిహద్దుల నుండి రష్యా తమ సేనలను వెనక్కి రప్పించుకుంది. ఉక్రెయిన్ లో కుట్ర ద్వారా రష్యా వ్యతిరేక, ఇ.యు + అమెరికా అనుకూల శక్తులు బలవంతంగా అధికారం చేజిక్కించుకున్న నేపధ్యంలో రష్యా బలగాలు ఉక్రెయిన్ సరిహద్దులో కొద్ది రోజులుగాసైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఈ విన్యాసాలను చాలించుకుని ఇక బ్యారక్ లను చేరుకోవాలని అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు ఇవ్వడంతో రష్యా సేనలు వెనక్కి వెళ్ళాయి. దీనితో అమెరికా + ఇ.యు మరియు రష్యాల మధ్య అంతర్గతంగా…

రష్యా అనుకూల ఆక్రమణలో తూర్పు ఉక్రెయిన్

పశ్చిమ దేశాల మద్దతుతో ఉక్రెయిన్ ప్రజా ప్రభుత్వాన్ని కుట్ర చేసి కూల్చివేసిన నేపధ్యంలో ఉక్రెయిన్ రష్యా, పశ్చిమ రాజ్యాల ప్రభావాల మధ్య నిలువునా చీలుతున్న భయాలు తలెత్తాయి. రష్యా అనుకూల ప్రజలు ఎక్కువగా నివసించే తూర్పు, దక్షిణ ఉక్రెయిన్ లలో పలు పట్టణాలలో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ ప్రభుత్వ భవనాలను స్వాధీనం చేసుకుని రష్యా జెండాలను ఎగురవేస్తున్నారు. కొన్ని చోట్ల తమ ప్రాంత భవితవ్యాన్ని నిర్ణయించేందుకు ‘ప్రజాభిప్రాయ సేకరణ’ జరపాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తుండగా ఉక్రెయిన్…

రష్యా అదుపులో క్రిమియా, నీతులు వల్లిస్తున్న అమెరికా

ఉక్రెయిన్ సంక్షోభం తీవ్రమై సైనిక జోక్యం వరకు వెళ్లింది. రష్యా, పశ్చిమ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడే స్ధితికి చేరింది. యూరోపియన్ యూనియన్ లో చేరడానికి నిరాకరించినందుకు అమెరికా, ఐరోపాలు ఉక్రెయిన్ లో హింసాత్మక చర్యలు రెచ్చగొట్టిన సంగతి తెలిసిందే. హింసాత్మక ఆందోళనలు చివరికి అధ్యక్షుడు యనుకోవిచ్ ను దేశం విడిచి వెళ్లిపోయేలా చేశాయి. అనంతరం ఇ.యు, అమెరికా అనుకూల శక్తులు, నాజీ తరహా జాతీయ విద్వేష పార్టీలు ప్రభుత్వ కార్యాలయాలను, పార్లమెంటును స్వాధీనం చేసుకున్నాయి.…

రష్యా టెర్రర్ దాడులకు కారణం సౌదీ?!

మూడు వారాల క్రితం రష్యా పట్టణం వోల్గో గ్రాడ్ లో జరిగిన ఉగ్రవాద పేలుళ్లకు కారణం సౌదీ అరేబియా అయి ఉండవచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ పేలుళ్లకు బాధ్యులుగా ఇంతవరకూ ప్రకటించుకోనప్పటికీ డోకు ఉమరోవ్ నేతృత్వంలోని చెచెన్ తీవ్రవాద సంస్ధే పేలుళ్లకు పాల్పడి ఉండవచ్చని ఇప్పుడు పలు పత్రికలు భావిస్తున్నాయి. చెచెన్ ఉగ్రవాద నేత డోకు ఉమరోవ్ ‘కాకసస్ ఎమిరేట్స్’ అనే సంస్ధకు నాయకత్వం వహిస్తున్నాడు. సౌదీ అరేబియా పాలక వంశం పోషించే వహాబిస్టు మత భావాలను…

రష్యాలో ఆత్మాహుతి దాడి, 16 మంది దుర్మరణం

రష్యాలోని వోల్వోగ్రాడ్ పట్టణ రైల్వే స్టేషన్ లో పట్ట పగలు ఆత్మాహుతి దాడి జరిగింది. ఒక మహిళా మిలిటెంటు తనను తాను పేల్చుకోవడంతో 16 మంది మరణించారని రష్యా టుడే పత్రిక తెలిపింది. మరో 37 మంది గాయపడ్డారని, వారిలో 8 మంది పరిస్ధితి ప్రమాదకరంగా ఉందని తెలుస్తోంది. ఆత్మాహుతి దాడికి పాల్పడిన మహిళ పేరు ఒక్సానా అస్లనోవా అని అనధికార వర్గాలను ఉటంకిస్తూ ఆర్.టి తెలిపింది. మరణాల సంఖ్యను రష్యా పరిశోధనా సంస్ధ ధృవీకరించింది. వోల్గోగ్రాడ్…

రష్యాకు మరో దౌత్య విజయం, ఇ.యుకు ఉక్రెయిన్ నో

పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని గేలి చేస్తూ రష్యా మరో దౌత్య విజయం నమోదు చేసింది. ‘మాస్టర్ స్ట్రోక్’ లాంటి ‘సిరియా రసాయన ఆయుధాల వినాశనం’ ద్వారా మధ్య ప్రాచ్యం రాజకీయాల్లో అమెరికాను చావు దెబ్బ తీసిన రష్యా ఇప్పుడు ఉక్రెయిన్ విషయంలో మరో పంజా విసిరింది. తాజా పంజా దెబ్బ ఫలితంగా యూరోపియన్ యూనియన్ తో వాణిజ్య సాపత్యం కోసం జరుపుతున్న చర్చలను సస్పెండ్ చేస్తూ ఉక్రెయిన్ ప్రధాని డిక్రీపై సంతకం చేశారు. ఉక్రెయిన్ చర్యతో వివిధ…

అమెరికా ఒత్తిడికి లొంగి స్నోడెన్ కు అనుమతివ్వని క్యూబా

అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కోవడంలో ముందుంటానని చెప్పుకునే క్యూబా ఎడ్వర్డ్ స్నోడెన్ తమ దేశంలో అడుగు పెట్టడానికి నిరాకరించిన సంగతి వెల్లడి అయింది. రష్యన్ విమానం నుండి ఎడ్వర్డ్ స్నోడెన్ క్యూబాలో దిగడానికి అనుమతీస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా బెదిరింపులకు దిగడంతో క్యూబా భయపడిపోయింది. ఎడ్వర్డ్ స్నోడెన్ ను తీసుకొచ్చినట్లయితే రష్యా విమానాన్ని తమ దేశంలో దిగడానికి అనుమతి ఇవ్వబోమని వెంటనే అమెరికాకు సమాచారం పంపింది. ఫలితంగా హాంగ్ కాంగ్ నుండి మాస్కో మీదుగా వెనిజులా…

రష్యా ఆశ్రయం మంజూరు, స్నోడెన్ కు బంధ విముక్తి

ఎట్టకేలకు ఎడ్వర్డ్ స్నోడెన్ కు రష్యా తాత్కాలిక రాజకీయ ఆశ్రయం (temporary asylum) మంజూరు చేసింది. దానితో స్నోడెన్ బంధ విముక్తుడయ్యాడు. గత ఐదు వారాలుగా మాస్కోలోని షెర్మెట్యెవో విమానాశ్రయంలో చిక్కుకుపోయిన స్నోడెన్ గురువారం తట్టా బుట్టా సర్దుకుని విమానాశ్రయం నుండి బైటకి వచ్చేశాడు. తద్వారా రష్యా భూభాగం పైకి అడుగు పెట్టాడు. స్నోడెన్ వీసా రద్దు చేయడం ద్వారా అతన్ని ఎలాగైనా రప్పించుకోవాలని పధకం వేసిన అమెరికాకు ఇది చావుదెబ్బ! అంతర్జాతీయ వేదికపై అమెరికా రాజకీయ…

సిరియాపై భద్రతా సమితిలో చర్చించడానికి ఒప్పుకోం -చైనా, రష్యా

సిరియాలో జరుగుతున్న ఆందోళనల విషయాన్ని భద్రతా సమితిలో చర్చించడానికి అంగీకరించేది లేదని చైనా, రష్యాలు తెగేసి చెబుతున్నాయి. వీటో అధికారం గల ఈ రెండు దేశాలు ఓటింగ్‌లో పాల్గొనకుండా విరమించుకోవడంతో లిబియా దేశంపై “నిషిద్ధ గగన తలం” అమలు చేయడానికీ, లిబియా పౌరులను రక్షించడానికి “అవసరమైన అన్ని చర్యలూ” తీసుకోవడానికీ బ్రిటన్, ఫ్రాన్సులు ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. తీరా తీర్మానం ఆమోదం పొందాక అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు లిబియా పౌరులను రక్షించే పేరుతో గడ్దాఫీని చంపడానికి…