జార్జియాను బెదిరించడం మానుకోవాలి, రష్యాకు ఫ్రాన్స్ హెచ్చరిక
మూడు రోజుల కాకసస్ పర్యటనలో ఉన్న ఫ్రాన్సు అధ్యక్షుడు నికొలస్ సర్కోజి చివరిగా జార్జియా పర్యటిస్తూ ఆ దేశానికి సంతోషం కలిగించే ప్రకటన చేశాడు. జార్జియ రాజధాని టిబ్‌లిసిలో వేలమంది జార్జియన్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ నికొలస్ సర్కొజీ రష్యా తన పొరుగుదేశం జార్జియాను బెదిరించడం సమర్ధనీయం కాదని పేర్కొన్నాడు. రష్యా తమ మిత్రదేశమేనని భావిస్తున్నామని కాని జార్జియాను బెదిరించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నాడు. 2008లో జార్జియా, రష్యాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని…