రష్యా ఎత్తులను పసిగట్టలేకపోతున్నాం -అమెరికా

ప్రపంచం లోని వివిధ యుద్ధ క్షేత్రాలలో అమెరికా మద్దతు ఉన్న పక్షాలు వరుస ఓటములు ఎదుర్కొంటున్న నేపధ్యంలో అమెరికా మిలట్రీ అధికారులు నిస్పృహకు లోనవుతున్నారని వారి ప్రకటనలు సూచిస్తున్నాయి. రష్యాయే ఇప్పుడు తమకు ప్రధాన శత్రువు అని ప్రకటించెంతవరకూ వారు వెళ్తున్నారు. “సెప్టెంబర్ 11, 2001 తర్వాత అమెరికా గూఢచార విభాగం ఎదుర్కొంటున్న అత్యంత పెద్ద వైఫల్యం మాస్కో ఎత్తులను ముందుగా పసిగట్టలేకపోవడం. ఈ వైఫల్యం ఫలితంగా క్రిమియాపై రష్యా దాడిని ముందుగా పసిగట్టలేకపోయాము. సిరియాలో రష్యా…

జార్జియాను బెదిరించడం మానుకోవాలి, రష్యాకు ఫ్రాన్స్ హెచ్చరిక

మూడు రోజుల కాకసస్ పర్యటనలో ఉన్న ఫ్రాన్సు అధ్యక్షుడు నికొలస్ సర్కోజి చివరిగా జార్జియా పర్యటిస్తూ ఆ దేశానికి సంతోషం కలిగించే ప్రకటన చేశాడు. జార్జియ రాజధాని టిబ్‌లిసిలో వేలమంది జార్జియన్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ నికొలస్ సర్కొజీ రష్యా తన పొరుగుదేశం జార్జియాను బెదిరించడం సమర్ధనీయం కాదని పేర్కొన్నాడు. రష్యా తమ మిత్రదేశమేనని భావిస్తున్నామని కాని జార్జియాను బెదిరించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నాడు. 2008లో జార్జియా, రష్యాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని…