ప్రజాందోళనల నడుమ కోతలు, రద్దుల బిల్లుని ఆమోదించిన గ్రీసు పార్లమెంటు
గ్రీసు ప్రభుత్వం తన ప్రజలపై ఆమానుషంగా ఆర్ధిక దాడులకు తెగబడే బిల్లుని ఆమోదించింది. ప్రవేటు, ప్రభుత్వ రంగాలలోని కార్మికులు, ఉద్యోగులు మంగళ, బుధవారాల్లో 48 గంటల సమ్మెను నిర్వహించినా, పార్లమెంటు బయట విరసనకారులు పోలీసులతో తలపడినా గ్రీసు ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకు పోయింది. 155 – 138 ఓట్ల తేడాతో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పొదుపు చర్యల బిల్ల ను పార్లమెంటు ఆమోదంచింది. ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు అప్పు ఇస్తున్న సందర్భంగా విధించిన…