‘దళిత హత్యాకాండ’ కేసులో శిక్షలన్నీ రద్దు చేసిన బీహార్ హై కోర్టు

భారత దేశంలో దళితులకి న్యాయం సుదూర స్వప్నమేనని మరోసారి రుజువయింది. 21 మంది దళితులను, ముస్లింలను బలితీసుకున్న ‘బఠానీ టోలా’ హత్యాకాండ కేసులో బీహార్ హై కోర్టు శిక్షలన్నింటినీ రద్దు చేసేసింది. మంగళవారం నిందితులందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది. సాక్ష్యాలు బలంగా లేవని చెప్పింది. ‘అనుమాన రహితం’గా నేరం రుజువు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని చెప్పింది. కింది కోర్టు ముగ్గురిపై విధించిన ఉరి శిక్షను, మరో 20 మందికి విధించిన యావజ్జీవ కారాగార శిక్షనూ ఒక్క తీర్పుతో…