నిరుద్యోగంతో తల్లిదండ్రుల చెంత చేరుతున్న అమెరికా యువత -కార్టూన్లు

స్కూల్ విద్య ముగియడంతోనే తల్లిదండ్రులను వదిలి సొంత కాళ్లపై నిలబడడానికి ప్రయత్నించే అమెరికా యువత ఇప్పుడు తన తీరు మార్చుకుంటోంది. బలహీన ఆర్ధిక వ్యవస్ధ సృష్టించిన సమస్యల సాగరాన్ని ఈదలేక స్వయం శక్తితో జీవనం గడిపే ఆలోచనలను విరమించుకుని తల్లిదండ్రుల తోడిదే లోకంగా సమాధానం చెప్పుకుంటున్నాడు. తల్లిదండ్రుల చెంతకు చేరడాన్ని వారేమీ సిగ్గుపడక, తల్లిదండ్రులతో సహజీవనాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు అమెరికా యువకులు చెబుతున్నారని  “ప్యూ రీసెర్చ్ సెంటర్” జరిపిన సర్వే లో వెల్లడయింది. అమెరికా ఆర్ధిక మాంధ్యం…