యోగాను సైన్స్ ఎందుకు అంగీకరించదు?
———-రచన: డాక్టర్ దేవరాజు మహారాజు (ప్రముఖ సాహితీవేత్త, జీవ శాస్త్రవేత్త) కొన్నేళ్ళ క్రితం వరకూ శారీరక శ్రమకు చాలా విలువ ఉండేది. పొలాలకు వెళ్ళడం, మోట కొట్టడం, నాగలి దున్నడం, పశువులు మేపడం వంటి ఏ పని తీసుకున్నా అది శారీరక శ్రమతో కూడుకున్నదే! గృహిణులు ఇంటి పనులే కాకుండా వ్యవసాయపు పనులు కూడా చేసేవారు. వడ్లు దంచడం, పిండి విసరడం వంటివన్నీ శారీరక శ్రమలే! అవన్నీ జీవన శైలిలో అంతర్భాగంగా ఉండేవి. ప్రత్యేకంగా వ్యాయామం చేయడం…



