తిండిలేక చనిపోతున్న యెమెన్ పిల్లలు సం.కి 34,000 -ఫొటోలు

యెమెన్ దేశంలో అత్యధిక శాతం పిల్లలు పోషకాహారం లేక చనిపోతున్నారు. ఐదేళ్లలోపు పిల్లల్లో 58 శాతం మంది తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతుండగా, 46 శాతం మంది తక్కువ బరువుతో తీసుకుంటున్నారని యునిసెఫ్ ప్రకటించింది. ఐదేళ్లలోపే చనిపోతున్న పిల్లల్లో 60 శాతం మంది పోషకాహార లోపం వల్లనే చనిపోతున్నారని ఆ సంస్ధ తెలిపింది. ఫలితంగా యెమెన్ లో పోషకార లోపం వల్ల ప్రతి సంవత్సరం 34,000 మంది చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. పోషకాహార లోపం వల్ల…

యెమెన్ లో ఆగని అనుకూల, ప్రతికూల ప్రదర్శనలు, షరతులతో రాజీనామాకి సిద్ధమన్న అధ్యక్షుడు

యెమెన్ లో అధ్యక్షుడికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతుండగా అధ్యక్షుడు కూడా తనకు అనుకూలంగా ర్యాలీలు నిర్వహింప జేస్తున్నాడు. అధ్యక్షుడు ఆలీ అబ్దుల్లా సలే వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేస్తూ నెలన్నర క్రితం రాజధాని సనా లోని యూనివర్సిటీ విధ్యార్ధులు మొదలు పెట్టిన ఉద్యమం ఇతర సెక్షన్ల ప్రజల చేరికతో తీవ్ర రూపం దాల్చింది. శుక్రవారం (మార్చి, 25) ఇరుపక్షాలు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించాయి. ర్యాలిల్లొ పదుల వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారని బిబిసి తెలిపింది.…

యెమెన్ ఆందోళనకారులతో చేతులు కలుపుతున్న మిలట్రీ అధికారులు

యెమెన్ అధ్యక్షుడు ఆలీ అబ్దుల్లా సలే కి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రం అయ్యేకొద్దీ మిలట్రీ అధికారులు ఒక్కరొక్కరుగా అధ్యక్షుడిని వదిలి ఆందోళనకారులతో చేరుతున్నారు. మిలట్రీ జనరల్ ఆలీ మొహసేన్ అల్-అమ్హర్ సోమవారం తన పదవికి రాజీనామా చేశాడు. “పోరాటం రాను రానూ క్లిష్ట సమస్యగా మారుతోంది. హింస, అంతర్యుద్ధం వైపుగా వెళ్తోంది. నా ఆలోచనలు, నాటోటి కమాండర్ల, సైనికుల ఆలోచనల ప్రకారం మేము యువకుల విప్లవానికి శాంతియుత మద్దతు తెలుపుతున్నాము. భద్రత, దేశ సుస్ధిరత లను కాపాడటంలో…

యెమెన్ నిరసనకారులపై పోలీసుల కాల్పులు, ఆరుగురు మృతి

ట్యునీషియా విప్లవం స్ఫూర్తితో యెమెన్ రాజుకు వ్యతిరేకంగా వారాల తరబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన పాటిస్తున్న ఉద్యమకారులపై  మార్చి 12 తేదీన పోలీసులు కాల్పులు జరిపి ఆరుగురిని చంపేశారు. 1250 మంది గాయపడ్డారనీ 250 మంది తీవ్రంగా గాయపడ్డారనీ డాక్టర్లు తెలిపారు. రాజధాని సనా లో ప్రజాస్వామిక సంస్కరణలను డిమాండ్ చేస్తూ యెమెన్ ప్రజలు అనేక వారాలనుండి “విమోచనా కూడలి” లో నిరసన శిబిరాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. 32 సంవత్సరాలనుండి అధికారంలో ఉన్న యెమెన్ అధ్యక్షుడు…