యెడ్యూరప్ప రాజీనామా వాయిదా, కర్ణాటక సంక్షోభం తీవ్రం

సోమవారం భవిష్యత్తు నిర్ణయించుకుంటానని చెప్పిన యెడ్యూరప్ప బి.జె.పి కి రాజీనామా చేసే నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడు. ఎం.ఎల్.ఎ ల ఒత్తిడితో పాటు పార్టీ సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ విజ్ఞప్తి మేరకు తన రాజీనామా నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు పత్రికలకు చెప్పాడని ఎన్.డి.టి.వి తెలిపింది. అయితే ముఖ్యమంత్రి సదానంద గౌడ పై ఆయన విమర్శలు కొనసాగించాడు. మరో వైపు బి.జె.పి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడాన్ని కొట్టి పారేయలేమని జనతా దళ్ (సెక్యులర్) నాయకుడు సిద్ధ రామయ్య…

రాజీనామాకి యెడ్యూరప్ప షరతులు, కర్ణాటక బి.జె.పిలో ప్రతిష్టంభన

కర్ణాటక ముఖ్యమంత్రి తనపై లోకాయుక్త నివేదికలో అక్రమ మైనింగ్ కుంభకోణంలో భాగస్వామ్యం వహించిన ఆరోపణలు చేయడంతో హైకమాండ్ ఆదేశాల మేరకు రాజీనామా చేస్తానని యెడ్యూరప్ప అంగీకరించినా, తీరా కేంద్ర పరిశీలకులు వచ్చాక మొండికేశాడు. కొన్ని షరతులు విధించి అవి నెరవేరితేనే రాజీనామా చేస్తానని చెబుతున్నాడు. తన మద్దతుదారులను పెద్ద సంఖ్యంలో తన అధికారిక నివాసం వద్దకు పిలిపించుకుని వారి చేత ఆందోళన చేయిస్తునాడు. యెడ్యూరప్పను కొనసాగనివ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనితో కర్ణాటక వచ్చిన కేంద్ర బృందం…

వెంటనే రాజీనామా చేయండి -యెడ్యూరప్పకు బి.జె.పి ఆదేశం

అక్రమ మైనింగ్‌ను అనుమతించి ముడుపులు అంగీకరించిన కర్ణాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప ఎట్టకేలకు రాజీనామా చేయనున్నాడు. అధికారం చేపట్టినప్పటినుండి నిరంతరం గండాలతో నెట్టుకుంటూ వచ్చిన బి.ఎస్.యెడ్యూరప్ప ముఖ్యమంత్రిత్వం ముగింపుకు వచ్చింది. సి.ఎం నేరుగా అక్రమ మైనింగ్ కుంభకోణంలో భాగం పంచుకున్నాడని లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డె నివేదిక స్పష్టం చేయడంతో బి.జె.పి నాయకత్వం యెడ్యూరప్పను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని గురువారం ఆదేశించింది. లోకాయుక్త నివేదిక దృష్ట్యా కర్ణాటకలో నాయకత్వాన్ని మార్చాలని నిర్ణయించి ఆ మేరకు ఆదేశాలు జారీ…