యెడ్యూరప్ప అవినీతి విచారణకు కర్ణాటక గవర్నర్ అనుమతి మంజూరు

మరి కొద్ది గంటల్లో మాజీ ముఖ్యమంత్రిగా మారనున్న యెడ్యూరప్పపై మరొక దెబ్బ పడింది. ఆయనపై లోకాయుక్త కనుగొన్న అవినీతి ఆరోపణలను విచారించడానికి కర్ణాటక గవర్నర్ ‘హంసరాజ్ భరద్వాజ్’ లోకాయుక్త పోలీసులకు అనుమతి మంజూరు చేశాడు. అక్రమ మైనింగ్ జరిపిన కంపెనీలతో కుమ్మక్కయ్యాడని లోకాయుక్త చేసిన ఆరోపణలపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి గవర్నర్ అనుమతి ఇచ్చేశాడు. దీనితో యెడ్యూరప్పకు కష్టాలు మరిన్ని పెరిగాయి. కాంగ్రెస్, బి.జె.పి పార్టీల మధ్య జరుగుతున్న ఈ నాటకటకం ఎంతవరకూ దారి తీస్తుందో చూడవలసి…