సుప్రీం కోర్టు రాజ్యాంగవిరుద్ధ తీర్పు ప్రతిఘటిస్తాం -పాక్ మాజీ ప్రధాని

పాకిస్ధాన్ లో పాలకవర్గాల ఘర్షణ ముదురుతోంది. రాజ్యాంగానికి విరుద్ధంగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినట్లయితే దానిని ప్రతిఘటిస్తామని మాజీ ప్రధాని గిలానీ ప్రకటించాడు. కోర్టు తీర్పును తిరస్కరించి సమస్యను ప్రజల ముందుకు తీసుకెళ్తామని కోర్టుకు నేరుగా హెచ్చరిక జారీ చేశాడు. కొత్త ప్రధాని అష్రాఫ్ ను ప్రధానిగా తొలగించినట్లయితే ప్రజలు ఆందోళన చేస్తారని హెచ్చరించాడు. ఆగస్టు 27 న తనముందు హాజరు కావాలని సుప్రీం కోర్టు కొత్త ప్రధాని ‘రాజా పర్వేజ్ అష్రాఫ్’ ను కొద్ది రోజుల…

సైన్యం కనుసన్నల్లో పాకిస్ధాన్ ప్రజాస్వామ్యం -కార్టూన్

శైశవ దశలో ఉన్న పాకిస్ధాన్ ప్రజాస్వామ్యం మరోసారి మిలట్రీ అధికారం ముందు తలవంచింది. నిజానికి మిలట్రీ పాలన అయినా, సో కాల్డ్ పార్లమెంటరీ ప్రజాస్వామ్య పాలన అయినా ప్రజలకు ప్రజాస్వామ్యం దక్కే అవకాశాలు పెద్దగా మారవు. పాలక వర్గాల లోని వివిధ సెక్షన్ల మధ్య అధికారం కోసం జరిగే కుమ్ములాటలే ‘పార్లమెంటరీ ప్రజాస్వామ్యం’ గానూ, ‘మిలట్రీ పాలన’ గానూ వేషం వేసుకుని పాక్ ప్రజల ముందుకు వస్తున్నాయి. ఇరు పక్షాల పాలనలోనూ పాకిస్ధాన్ ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీ…

గిలానీ ప్రధాని పదవికి అనర్హుడు, పాక్ సుప్రీం కోర్టు సంచల తీర్పు

పాకిస్ధాన్ మిలట్రీ, పౌర ప్రభుత్వాల మధ్య ఆధికారాల కోసం జరుగుతున్న ఘర్షణలో తాజా అంకానికి తెర లేచింది. ప్రధాని కోర్టు ధిక్కారానికి పాల్పడ్డాడని రెండు నెలల క్రితం సుప్రీం తీర్పు చెప్పిన నేపధ్యంలో ప్రధాన మంత్రి గిలానీ పార్లమెంటు సభ్యత్వం రద్దయినట్లేననీ, కనుక గిలానీ పదవి నుండి దిగిపోవాల్సిందేనని సంచల రీతిలో తీర్పు ప్రకటించింది. ప్రధానిని పదవి నుండి తొలగించే అధికారం ఒక్క పార్లమెంటుకు మాత్రమే ఉందనీ, కోర్టులు ఇందులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్న ప్రభుత్వ వాదనలను…

‘కోర్టు ధిక్కారం’ కేసులో పాక్ ప్రధాని దోషి, 30 సెకన్లు జైలు

పాక్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ పై ‘కోర్టు ధిక్కారం’ నేరం రుజువయిందని పాకిస్ధాన్ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. నేరం రుజువయినప్పటికీ ‘సంకేతాత్మక’ శిక్షతో ప్రధానిని కోర్టు వదిలిపెట్టింది. ఆయనపై జైలు శిక్ష గానీ, మరొక శిక్షగానీ విధిస్తున్నట్లు కోర్టు ప్రకటించలేదు. గిలానీ ప్రధాని పదవికి వచ్చిన ముప్పేమీ లేదని కూడా తెలుస్తోంది. మాజీ మిలట్రీ పాలకుడు ముషార్రఫ్ పాలనలో అధ్యక్షుడు జర్దారీతో పాటు అనేకమంది రాజకీయ నాయకులపై ఉన్న అవినీతి కేసుల్లో ముషార్రఫ్ క్షమా…

“నెగిటివ్ సందేశాలు పంపొద్దు” అమెరికాని కోరిన పాక్ ప్రధాని

అమెరికా, పాకిస్ధాన్ దేశాల రాజకీయ నాయకులు, అధికారుల మధ్య ‘మాటల యుద్ధం’ కొనసాగుతోంది. అమెరికానుండి ప్రతికూల సందేశాలు అందుతుండడం పట్ల పాకిస్ధాన్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ మంగళవారం విచారం వ్యక్తం చేశాడు. హక్కానీ గ్రూపు మిలిటెంట్లపై దాడి పేరుతో పాకిస్ధాన్, ఆఫ్ఘన్ సరిహద్దును దాటి అమెరికా దాడులు చేసినట్లయితే అది పాక్ సార్వభౌమత్వానికి భంగం కలిగినించినట్లేనని హెచ్చరించాడు. “ప్రతికూల (నెగిటివ్) సందేశాలు మా ప్రజలను ఆందోలనకు గురిచేస్తున్నాయి. మా స్నేహ సంబంధాలకు అనుగుణం కాని రీతిలో…