‘యూరో’ ను నిలబెట్టడానికి జర్మనీ, ఫ్రాన్సుల విఫల యత్నం -కార్టూన్
యూరప్ రుణ సంక్షోభం పుణ్యమాని యూరప్ ఐక్యత కు ప్రమాదం ముంచుకొచ్చింది. గత రెండేళ్ళనుండీ యూరో జోన్ దేశాలు అనేక చర్యలు తీసుకున్నప్పటికీ ‘యూరప్ రుణ సంక్షోభం’ నిత్య యవ్వనంతో శోభిల్లుతోంది. యూరోపియన్ యూనియన్ ఏర్పాటుకి బాటలు వేసిన లిస్బన్ ఒప్పందం లో మార్పులు చేయడానికి గత శుక్రవారం జరిగిన ఇ.యు శిఖరాగ్ర సమావేశం నిర్ణయించగా బ్రిటన్ ఆ తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇరవే ఏడు దేశాల్లో బ్రిటన్ ప్రస్తుతం ఏకాకిగా ఉన్నా భవిష్యత్తులో దానికి మద్దతు…