ఆర్ధిక మాంద్యం కోరల్లో 17 దేశాల యూరోజోన్ -ఒఇసిడి

ఋణ సంక్షోభం ఫలితంగా, 17 యూరప్ దేశాల ద్రవ్య యూనియన్ అయిన ‘యూరో జోన్’ లో ఆర్ధిక మాంద్యం (recession) బలపడుతోందని ఒఇసిడి (Organisation for Economic Coperation and Development) నిర్ధారించింది. తాను మాంద్యంలో కూరుకుపోతూ ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధను కూడా అందులోకి ఈడుస్తోందని ప్యారిస్ లో విడుదల చేసిన మధ్యంతర నివేదికలో పేర్కొందని అసోసియేటెడ్ ప్రెస్ (ఎపి) వార్తా సంస్ధ తెలిపింది. యూరప్ నాయకురాలు జర్మనీ సైతం ఈ సంవత్సరాంతానికి మాంద్యంలోకి జారుతుందని ఒఇసిడి…

ప్రమాదంలో జర్మనీ టాప్ రేటింగ్, ఋణ సంక్షోభమే కారణం

యూరపియన్ యూనియన్ ఆర్ధిక కేంద్రం అయిన జర్మనీని సైతం ఋణ సంక్షోభం చుట్టు ముడుతున్న ఛాయలు కనిపిస్తున్నాయి. ‘మూడీస్’ రేటింగ్ సంస్ధ జర్మనీ క్రెడిట్ రేటింగ్ ‘ఔట్ లుక్’ ను ‘స్థిరం’ (స్టేబుల్) నుండి ‘ప్రతికూలం’ (నెగిటివ్) కు తగ్గించింది. తద్వారా రానున్న రెండేళ్లలో జర్మనీ AAA రేటింగ్ కోల్పోవచ్చని సంకేతం ఇచ్చింది. ‘యూరో’ ఉమ్మడి కరెన్సీ గా చేసుకున్న 17 దేశాల యూరో జోన్ కూటమి నుండి గ్రీసు బైటికి వెళ్లిపోతుందన్న అంచనా తో పాటు…

బ్యాంకులు కంపెనీల కోసం ఇ.సి.బి ఉదారం, వడ్డీ రేటు 0.75% కి తగ్గింపు

ప్రపంచ ఆర్ధిక సంక్షోభానికి కారకులయిన బహుళ జాతి వాల్ స్ట్రీట్ బ్యాంకులు, కంపెనీల కోసం యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు (ఇ.సి.బి) మరోసారి యధా శక్తి ఉదారతను ప్రదర్శించింది. ఇప్పటికే హీన స్ధాయిలో 1 శాతం వడ్డీ రేటును 0.25 శాతం తగ్గించి 0.75 శాతానికి చేర్చింది. 2007 ఆర్ధిక సంక్షోభం నుండి అత్యంత తక్కువ స్ధాయి 0.25 శాతం వద్ద వడ్డీ రేటు కొనసాగిస్తున్న అమెరికన్ సెంట్రల్ బ్యాంకు ‘ఫెడరల్ రిజర్వ్’ కంటే ఇది కేవలం అర…

లాభాల్లో షేర్లు, ప్రణబ్ సవరణపై వివరణ ఫలితం?

శుక్రవారం భారత షేర్ మార్కెట్లు అత్యధిక లాభాలతో ముగియగా, రూపాయి బాగా కోలుకుంది. బి.ఎస్.ఇ సెన్సెక్స్ రికార్డు స్ధాయిలో 2.59 శాతం (439 పాయింట్లు) లాభ పడగా డాలరుతో రూపాయి మారకం విలువ దశాబ్ధంలోనే రికార్డు స్ధాయిలో 119 పైసలు పెరిగింది. ఇటలీ, స్పెయిన్ దేశాలకు ఋణాల రేట్లు తగ్గించడానికి యూరోపియన్ దేశాల సమావేశం నిర్ణయాత్మక చర్యలు ప్రకటించడమే భారత మార్కెట్ల ఉత్సాహానికి కారణమని రాయిటర్స్ వార్తా సంస్ధ విశ్లేషించగా, ప్రణబ్ సవరణపై (GAAR) ఆర్ధిక శాఖ…

యూరోపియన్ యూనియన్ క్రెడిట్ రేటింగ్ తగ్గిస్తాం -ఎస్ & పి హెచ్చరిక

యూరో జోన్ లోని మొత్తం పదిహేడు దేశాల క్రెడిట్ రేటింగ్ తగ్గినట్లయితే యూరోపియన్ యూనియన్ క్రెడిట్ రేటింగ్ కూడా తగ్గించాల్సి ఉంటుందని స్టాండర్డ్ అండ్ పూర్ క్రెడిట్ రేటింగ్ సంస్ధ హెచ్చరించింది. ఇ.యు రేటింగ్ తో పాటు ఇ.యు లో ఉన్న అతి పెద్ద బ్యాంకుల రేటింగ్ కూడా తగ్గించాల్సి ఉంటుందని ఆ సంస్ధ హెచ్చరించింది. శుక్రవారం జరగనున్న యూరోపియన్ యూనియన్ సమావేశంలో సంక్షోభ పరిష్కారానికి నిర్ణయం తీసుకోవాల్సిందేనని ఎస్ & పి పరోక్ష హెచ్చరిక చేసినట్లయ్యింది.…

యూరోనుండి గ్రీసు తప్పుకుంటుందని పుకార్లు, యూరో విలువ పతనం

అప్పు సంక్షోభంలో ఉన్న గ్రీసు యూరోను ఉమ్మడి కరెన్సీగా రద్దు చేసుకుని స్వంత కరెన్సీ పునరుద్ధరించుకోనుందన్న పుకార్లు వ్యాపించడంతో యూరో విలువ ఒక శాతానికి పైగా పడిపోయింది. గత సంవత్సరం మే నెలలో ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ ల నుండి 110 బిలియన్ యూరోల సహాయ ప్యాకేజిని అందుకున్న గ్రీసు ఆ ప్యాకేజీతో పాటు కఠినమైన షరతులను అమలు చేయాల్సి వచ్చింది. షరతుల్లో భాగంగా ప్రజలపైన భారం మోపుతూ పొదుపు విధానాలను అమలు చేయడం ప్రారంబించింది. అనేక ప్రభుత్వ…

యూరోజోన్ లోనూ దౌడు తీస్తున్న ద్రవ్యోల్బణం

17 యూరప్ దేశాల యూరోజోన్ లో ద్రవ్యోల్బణం మార్చి నెలకంటే మరికాస్త పెరిగింది. యూరోస్టాట్ అధికారిక అంచనా ప్రకారం యూరోజోన్ ద్రవ్యోల్బణం మార్చి నెలలో 2.7 శాతం నమోదు కాగా, అది ఏప్రిల్ నాటికి 2.8 శాతానికి పెరిగింది. మార్చితో పోలిస్తే ఏప్రిల్ పెరుగుదల స్వల్పంగా కనిపించినా యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఇసిబి) విధించుకున్న పరిమితితో పోలిస్తే ఎక్కువే. ఇసిబి అంచనా ప్రకారం ద్రవ్యోల్బణం 2 శాతానికి మించితే సమస్యలు తప్పవు. ద్రవ్యోల్బణం పెరగకుండా ఉండటానికి ఈ…

గ్రీసు రేటింగ్ ను తగ్గించిన మూడీస్, కొనసాగుతున్న యూరప్ అప్పు సంక్షోభం

మూడీస్ రేటింగ్ సంస్ధ గ్రీకు సావరిన్ అప్పు రేటింగ్ ను మరోసారి తగ్గించింది. ఇప్పటివరకూ Ba1 రేటింగ్ ఉండగా దానిని B1కు తగ్గించింది. ట్రెజరీ బాండ్లు జారీ చేయడం ద్వారా దేశాల ప్రభుత్వాలు చేసే అప్పును సావరిన్ అప్పు అంటారు. సావరిన్ బాండ్లను ప్రభుత్వాలు వేలం వేస్తాయి. బాండ్లు జారీచేసే దేశాల ఆర్ధిక వ్యవస్ధలపై బాండ్ల కొనుగోలుదారులకు (మదుపుదారులు) ఉన్న నమ్మకాన్ని బట్టి బాండ్లపై ప్రభుత్వాలు చెల్లించే వడ్డీ రేటు నిర్ణయమవుతుంది. ప్రభుత్వాలు బాండ్ల విలువ మొత్తాన్ని…