స్వయం ప్రతిపత్తి కోసం సొంత శాటిలైట్ల ఏర్పాటులో ఐరోపా!

వ్యూహాత్మక ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు ఇన్నాళ్లూ అమెరికాపై ఆధారపడుతూ వచ్చిన ఐరోపా దేశాలు (యూరోపియన్ యూనియన్) ఇక తమకంటూ సొంత ఏర్పాట్లు చేసుకునే ప్రయత్నాల్లో పడ్డాయి. అందుకు అవసరమైన మౌలిక నిర్మాణాలను (ఇన్ఫ్రాస్ట్రక్చర్) ఉనికిలోకి తెస్తున్నాయి. ఐరోపా వ్యాపితంగా దృఢమైన, గ్యారంటీతో కూడిన ఇంటర్నెట్ కనెక్టివిటీని స్థాపించడం కోసం సొంత ఉపగ్రహాలను భూ కక్ష్యలో ప్రవేశ పెట్టాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయించింది. ఇందుకోసం 6 బిలియన్ యూరోల ($6.8 బిలియన్లు) నిధులు కేటాయించినట్లు యూరోపియన్ కమిషన్ ప్రకటించింది. ఉపగ్రహాల…

బ్రటిస్లావా నుండి వచ్చే రోడ్డు (ఎటు వైపు?) -ద హిందూ ఎడిట్…

– [ఈ రోజు ద హిందూ ‘The road from Bratislava’ శీర్షికన  ప్రచురించిన సంపాదకీయానికి ఇది యధాతథ అనువాదం] ఒకటి తక్కువ 28 ఈయూ దేశాలు బ్రెగ్జిట్ అనంతర ప్రపంచం గురించి చర్చించడానికి సమావేశమైన బ్రటిస్లావా భవంతిలో ఐక్యత, పొందికల లేమి సుస్పష్టంగా వ్యక్తం అయింది. ఏ ఒక్కరూ ఎలాంటి భ్రమలకూ తావు ఇవ్వటం లేదు. ఈయూ ఉనికికి సంబంధించిన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్-క్లాడ్…

రష్యా సదస్సుకు ఈ‌యూ నేత, అమెరికా అభ్యంతరం!

అమెరికా, యూరోపియన్ యూనియన్ ల మధ్య లుకలుకలు మెల్లగానే అయినా పెరుగుతున్నాయి. రష్యా నగరం సెయింట్ పీటర్స్ బర్గ్ లో ప్రతి యేటా జరిగే “సెయింట్ పీటర్స్ బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ ఫోరం” (SPIEF) సమావేశాలకు ఈ యేడు యూరోపియన్ కమిషన్ (ఈ‌సి) అధ్యక్షుడు జీన్-క్లాడ్ జంకర్ హాజరు కానున్నాడు. ఆయన రష్యా వెళ్లడానికి అమెరికా అభ్యంతరం చెబుతోంది. ఒక పక్క రష్యాపై అమెరికా-ఈ‌యూల ఆర్ధిక, వాణిజ్య ఆంక్షలు కొనసాగుతుండగా రష్యా జరిపే ఆర్ధిక సదస్సుకు ఈ‌సి…