గ్రీసు రుణ సంక్షోభం: లెంపలు వేసుకున్న ఐ.ఎం.ఎఫ్
దేశాల ఆర్ధిక వ్యవస్ధల తప్పులను సవరించే బాధ్యతను తనకు తాను నెత్తిమీద వేసుకున్న అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) సంస్ధ మొదటిసారిగా, పటాటోపానికే ఐనా, లెంపలు వేసుకుంది. గ్రీసు దేశ ప్రజలపై బలవంతంగా రుద్దిన పొదుపు విధానాలు ఎంతవరకు పని చేస్తాయన్న విషయమై తాము తప్పుడు అంచనాలు వేశామని అంగీకరించింది. అమెరికా, ఐరోపాల తరపున ప్రపంచ దేశాల మీద ద్రవ్య పెత్తనం సాగించే ఐ.ఎం.ఎఫ్, తాను తప్పు చేశానని ఒప్పుకోవడం అసాధారణం. అయితే, ఈ ఒప్పుకోలు వలన…