పార్లమెంటు విశ్వాస పరీక్షలో ‘ఓటుకు నోట్లు’ కేసు దర్యాప్తుపై సుప్రీం కోర్టు ఆగ్రహం

2008 సంవత్సరంలో పార్లమెంటు విశ్వాసం పొందడం కోసం యు.పి.ఎ – 1 ప్రభుత్వం డబ్బులిచ్చి ప్రతిపక్షాల ఓట్లు కొన్న కేసులో దర్యాప్తు కొనసాగుతున్న తీరు పట్ల సుప్రీం కోర్టు శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు సంవత్సరాల నుండి కేసు విచారణలో పురోగతి లేకపోవడంతో ఢిల్లీ పోలీసుల పనితీరుపై అసహనం వ్యక్తం చేసింది. “ఢిల్లీ పోలీసులు చేసిన దర్యాప్తు పట్ల మేము ఏ మాత్రం సంతోషంగా లేము. ఇటువంటి తీవ్రమైన నేరంతో కూడిన అంశంలో, నేరం…