నారాయణ స్వామి కత్తి దూశారు… తిరగేసి! -కార్టూన్
సిబిఐ పుణ్యమాని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వి.నారాయణ స్వామి వార్తల్లో నానుతున్నారు. తమిళనాడు ప్రతిపక్ష పార్టీ డిఎంకె, యుపిఎ ను వదిలి వెళ్ళిన మరుసటి రోజే ఆ పార్టీ నేత కరుణానిధి తనయులు స్టాలిన్, అళగిరి ఇళ్లపైన సిబిఐ చేత దాడి చేయించడం ద్వారా అన్ని పక్షాల నుండి ఆయన విమర్శలను ఎదుర్కొంటున్నాడు. దురుద్దేశం ఏమీ లేదని సిబిఐ తన పని తాను చేసుకుందే తప్ప ప్రభుత్వానికి దానికి సంబంధం లేదనీ, అది స్వతంత్ర సంస్థ…