‘ఓటుకు నోటు’ కేసులో రెండవ అరెస్టు, ఈ సారి బిజెపి వంతు?

సుప్రీం కోర్టు జోక్యంతో “ఓటుకు నోటు” కేసు ముందుకు కదులుతున్నట్లు కనిపిస్తోంది. ముగ్గురు బి.జె.పి ఎం.పిలు యు.పి.ఎ-1 ప్రభుత్వం ప్రవేశ పెట్టిన విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయకుండా ఓటింగ్ నుండి నిష్క్రమించడానికి కాంగ్రెస్ పార్టీవారు తమకు కోటి రూపాయలు ఇచ్చారంటూ, విశ్వాస పరీక్షరోజే ఆరోపించిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం ఈ కేసులో ఢిల్లీ పోలీసులు సమాజ్ వాదీ పార్టీ మాజీ నాయకుడు అమర్ సింగ్‌కు సయాయకుడుగా ఉన్న సంజీవ్ సక్సేనాను అరెస్టు చేశారు.…