సుప్రీం కోర్టు తలంటుతో కదిలిన ఢిల్లీ పోలీసులు, ‘నోటుకు ఓటు’ స్కామ్‌లో సంజీవ్ సక్సేనా అరెస్టు
ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు ఒకడుగు ముందుకేశారు. ‘నోటుకు ఓటు’ కుంభకోణం పరిశోధనలో రెండు సంవత్సరాలనుండి ఎటువంటి పురోగతి లేకపోవడంపై సుప్రీం కోర్టు రెండ్రోజుల క్రితం తీవ్ర స్ధాయిలో తలంటడంతో, తమ దర్యాప్తుకు శ్రీకారం చుట్టారు. ముగ్గురు బి.జె.పి ఎం.పిలు యు.పి.ఎ ప్రభుత్వ విశ్వాస పరీక్షలో అనుకూలంగా ఓటు వేయడానికి అమర్ సింగ్ అనుచరుడు సంజీవ్ సక్సేనా కోటి రూపాయలు ఇచ్చిన ఆరోపణపై సంజీవ్ సక్సేనాను అరెస్టు చేశారు. అయితే అసలు పాత్రధారుడు సంజీవ్ సక్సేనా కాదు. ఆయన…