అవినీతిపై విచారణ కోరినందుకు అధికారిని పిచ్చాసుపత్రిలో చేర్చబోయిన యు.పి ప్రభుత్వం

మాయావతి పాలన అవినీతి మయం అయిందంటూ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వ స్కీముల్లో జరుగుతున్న అవినీతి పై విచారణ కోరుతూ ధర్నా చేస్తున్న రాష్ట్ర అధికారిని పిచ్చాసుపత్రిలో చేర్చడానికి ప్రయత్నించింది. అధికారిని చేర్చుకోవడానికి డాక్టర్లు నిరాకరించడంతో పోలీసులు వెనుదిరగవలసి వచ్చింది. రెండేళ్ల క్రితం మాఫియా కాల్పుల్లో కన్ను కోల్పోయినప్పటికీ అవినీతి వ్యతిరేక పోరాటం కొనసాగిస్తున్నందుకు ‘రింకు సింగ్ రాహి’ని పిచ్చివాడుగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గూండా పాలనను…