పిలవని పేరంటానికి అమెరికా, లిబియా వద్ద యుద్ధ వాతావరణం

  అమెరికాకి ఈ జన్మలో బుద్ధిరాదు. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లలొ చావుతప్పి కన్ను లొట్టబోయినా ఇంకా పాఠాలు నేర్చుకోలేదు. తగుదునమ్మా అంటూ పిలవని పేరంటానికి బయలుదేరింది. లిబియా ప్రాంతంలో తమ యుద్ధ పరికరాలు, సైనికులను లిబియాపై చర్యకు అనుకూలంగా ఉండేలా మొహరిస్తున్నట్టు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. నిర్ణయాలు తీసుకున్న వెంటనే చర్య ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపింది. నాటో తదితర మిత్రులతో చర్చలు జరుపుతున్నామనీ, గడ్డాఫీ సైన్యానికి చెందిన విమానాలు తిరగకుండా ఉండటానికి లిబియా గగన తలాన్ని…