ఎయిర్ ఇండియాకు బోయింగ్ విమానాలు అమ్మకుండా యు.ఎస్ ఎయిర్ లైన్స్ అడ్డుపుల్ల

వ్యాపార పోటీని అడ్డదారిలో అడ్డు తప్పించుకోవడం అమెరికా కంపెనీలకు వెన్నతో పెట్టిన విద్య. చైనాతో గల వాణిజ్య లోటును తగ్గించుకోవడానికి వ్యాపార, వాణిజ్యాల్లో పోటిపడడం చేతగాని అమెరికా, చైనా తన కరెన్సీని అసహజంగా తక్కువ స్ధాయిలో ఉంచుతున్నదని ఆరోపిస్తూ యువాన్ విలువను పెంచేలా ఒత్తిడి తెచ్చి, చైనా నుండి వస్తున్న దిగుమతులను తగ్గించుకుని, తన వాణిజ్య లోటును తగ్గించుకోవాలని అమెరికా ఎత్తులు వేస్తున్నది. ఇప్పుడు బోయింగ్ విమానాలను ఇండియా కొనుగోలు చేయడానికి వీలుగా ఇండియా కంపెనీలకు, అమెరికాకి…