అమెరికా యుద్ధ నేరాలకు మచ్చుతునక ‘కోలేటరల్ మర్డర్’ -వీడియో

“అబద్ధాలు నిజాలుగా ధ్వనించడానికీ, హత్యలు గౌరవనీయమైనవిగా చేయడానికీ, ఒట్టి గాలిని సైతం గట్టి పధార్ధంగా చూపడానికీ రాజకీయ పరిభాష ఉద్దేశించబడింది” -జార్జ్ ఆర్వెల్ “Political language is designed to make lies sound truthful and murder respectable, and to give the appearance of solidity to pure wind.” -George Orwell మార్చి 22 న ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల సంస్ధలో అమెరికా ఒక తీర్మానం ప్రవేశపెట్టింది. ఎల్.టి.టి.ఈ…

ఫుకుషిమా కంటే ‘ఇరాన్ పై ఆంక్షలే’ మాకు పెను ప్రమాదం -జపాన్

2011 లో సంభవించిన ఫుకుషిమా అణు ప్రమాదం కంటే ఇరాన్ పై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల వల్లనే తమకు పెను ప్రమాదంగా పరిణమిస్తాయని జపాన్ భావిస్తోంది. అమెరికాలో జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ ‘ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజన్సీ’ మాజీ డైరెక్టర్ నోబువో తనాకా ఈ మేరకు ఆందోళన వెలిబుచ్చాడు. ఇరాన్ పై విధించిన ఆంక్షల వల్ల తమ దేశానికి జరిగే గ్యాస్, ఆయిల్ సరఫరాలు ఆగిపోతాయనీ, దానివల్ల 2011 లో ఫుకుషిమా అణు ప్రమాదం వల్ల…

Pirate of the Malvinas

‘వలస బుద్ది’ వీడన్ బ్రిటన్ -కార్టూన్

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ప్రపంచ దేశాలను కబళించే అగ్రరాజ్యంగా అవతరించడంతో ‘రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం’ అస్తమించింది. అనేకవలసల నుండి విరమించుకున్న బ్రిటన్ అమెరికాకి ఉపగ్రహ రాజ్యంగా మారిపోయింది. స్వతంత్ర దేశాలపై అమెరికా సాగిస్తున్న దురాక్రమణ యుద్ధాల్లో జూనియర్ పార్టనర్ గా చేరింది. అయితే అదింకా అర్జెంటీనా కి చెందిన ‘మాల్వినాస్’ (బ్రిటన్ దీనిని ఫాక్ లాండ్స్ గా పిలుస్తుంది) ద్వీపకల్పాన్ని ఇంకా తన వలసగానే పరిగణిస్తోంది. మాల్వినాస్ ని సముద్రాలకు ఆవల ఉన్న…

Jobs and wars

ఉద్యోగాలు, యుద్ధాలు -కార్టూన్

దురాక్రమణ యుద్ధాలవల్ల ఆర్ధిక వ్యవస్ధలు కులారిల్లుతున్నప్పటికీ, అవే యుద్ధాల వల్ల కంపెనీల లాభాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న పరిస్ధితి ఉంది. యుద్ధాలు చేసి దురాక్రమించి ప్రపంచ వనరులు గుప్పెట్లో పెట్టుకోవడం పశ్చిమ దేశాల ‘మిలట్రీ-ఇండస్ట్రియల్ కాంప్లెక్స్’ దురాశ కాగా, యుద్ధాలకు ఎదురొడ్డి నిలిచే శక్తుల వల్లా, యుద్ధోన్మాదుల అదుపులో లేకుండా పోయే యుద్ధ ఖర్చుల వల్లా ఆర్ధిక సంక్షోభాలు అనివార్యంగా ఎదురవుతున్న పరిస్ధితి. ఈ పరిస్ధితుల్లో నిరుద్యోగ సైన్యానికి ఉద్యోగాలు దొరకడం దుర్లభం అవుతున్నా, యుద్ధాలు మాత్రం…

ఇరాన్ ఆయిల్ కొనవద్దు, ఇండియాకి అమెరికా బెదిరింపు

తన మాట వినని దేశాలను బెదిరించి దారికి తెచ్చుకునే అమెరికా ఇండియాపై కూడా బెదిరింపులు మొదలు పెట్టింది. ఇరాన్ పై అమెరికా, యూరప్ లు ఆంక్షలు విధించినప్పటికీ ఇరాన్ ఆయిల్ కొనడం ఆపేది లేదని భారత దేశం చెప్పటంపై అమెరికా కన్నెర్ర చేస్తోంది. ఇరాన్ నుండి ఆయిల్ దిగుమతులను తగ్గించుకోని పక్షంలో అమెరికా బ్యాంకులను ఇండియాకి అందకుండా చేయడానికి తాము వెనకాడేది లేదని అమెరికా అధికారిని ఉటంకిస్తూ బ్లూమ్ బర్గ్ పత్రిక తెలిపింది. అమెరికా తాను విధించిన…

ఇద్దరు స్త్రీలను రేప్ చేసి తర్వాత హత్యాకాండ జరిపారు -ఆఫ్ఘన్ పార్లమెంటరీ కమిటీ

హత్యాకాండ జరిగిన రాత్రి అమెరికా సైనికులు జరిపిన అకృత్యాలు ఒక్కొక్కటే వెలుగులోకి వస్తున్నాయి. అమెరికా సైనికులు హత్యాకాండకి ముందు ఇద్దరు ఆఫ్ఘన్ స్త్రీలను రేప్ చేసి అనంతరం హత్యాకాండ జరిపారని పార్లమెంటరీ విచారణ కమిటీ సభ్యులు, శనివారం ఆఫ్ఘన్ పార్లమెంటులో ప్రకటించారు. హత్యాకాండలో చనిపోయిన నలుగురు స్త్రీలలో రేప్ కి గురికాబడిన ఇద్దరు స్త్రీలు ఉన్నారని కమిటీ సభ్యులు పార్లమెంటుకి తెలియజేశారు. జంగాబాద్ ప్రాంతంలో అమెరికా ట్యాంకర్ ఒకదానిని మందుపాతరతో పేల్చివేసినందుకు ప్రతీకారంతోనే అమెరికా సైనికులు ఈ…

20 మంది అమెరికా సైనికులు హత్యాకాండలో పాల్గొన్నారు -ఆఫ్ఘన్ పార్లమెంటరీ కమిటీ

మార్చి 12 తెల్లవారు ఝామున, కాందహార్ సమీప గ్రామాల్లో ఆఫ్ఘనిస్ధాన్ పౌరులపై జరిపిన హత్యాకాండలో 20 మంది వరకూ అమెరికా సైనికులు పాల్గొన్నారని ఆఫ్ఘనిస్ధాన్ పార్లమెంటరీ విచారణా కమిటీ తేల్చింది. ఆఫ్ఘనిస్ధాన్ పార్లమెంటు సభ్యులతో ఏర్పడిన పార్లమెంటరీ విచారణ కమిటీ హత్యా కాండ బాధిత గ్రామాలను సందర్శించి వాస్తవాలు సేకరించింది. ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడి వివరాలు సేకరించింది. హామీద్జాయ్ లాలి, అబ్దుల్ రహీమ్ ఆయుబి, షకీబా హష్మి, సయ్యద్ మహమ్మద్ ఆఖుండ్, బిస్మిల్లా ఆఫ్ఘన్మాల్, షకీలా హష్మి…

Perfect war

పక్కా యుద్ధం (Perfect war) -కార్టూన్

– “పక్కా యుద్ధాన్నే మేం ప్రారంభించాం! ఇప్పుడంతా యుద్ధంలో మునిగిపోయారు. కాని తమ శత్రువు ఎవరో ఇప్పుడు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు” – ‘టెర్రరిజం పై యుద్ధం’ పేరుతో అమెరికా ప్రారంభించిన యుద్ధానికి ఇప్పుడు దిక్కూ, దరీ లేదు. ‘టెర్రరిస్టులపై యుద్ధమే’ లక్ష్యం అయితే ఆ లక్ష్య శుద్ధి ప్రారంభంలోనే లేదు. ఆల్-ఖైదాతో యుద్ధం అని చెప్పి, అదే ఆల్జ్-ఖైదాతో కుమ్మక్కై ప్రభుత్వాలు ఏర్పరుస్తున్నారు. ఆఫ్ఘనిస్ధాన్ లో ఆల్-ఖైదాతో యుద్ధం, లిబియాలో ఆల్-ఖైదాతో కుమ్మక్కై…

అతను మనిషి, ఆస్తి కాదు -ఎంబసీ బాంబు కేసులో మేజిస్ట్రేట్

ఇజ్రాయెల్ ఎంబసీ కారుపై బాంబు దాడి జరిగిన కేసులో నిందితుడిని విచారించడానికి ఇజ్రాయెల్ గూఢచార సంస్ధ ‘మొస్సాద్’  అనుమతించారన్న ఆరోపణలపై కోర్టు తీవ్రంగా స్పందించింది. “అనుమానితుడు మనిషి, ఆస్తి కాదు” అని తీవ్రంగా వ్యాఖ్యానించింది. నిందితుడిని విచారించినవారి జాబితాను తన ముందుంచాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. నిందితుడిపై జరిపిన విచారణపై తక్షణం ‘డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్’ స్ధాయికి తగ్గని పోలీసు అధికారి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. “ప్రయోగశాలలో పరీక్షలు జరిపే పందిగా నిందితుడిని మార్చారన్న”…

శ్రీలంక కిల్లింగ్ ఫీల్డ్స్, ఈ దారుణాలు చూడగలరా? -ఫొటోలు

సాటి మనుషుల్ని ఇంత పైశాచికంగా హింసించడం ‘మనిషి’ గా చచ్చిపోతే తప్ప సాధ్యం కాదు. ‘క్లినికల్లీ డెడ్’ లాగా ‘హ్యూమన్లీ డెడ్’ లాంటి ఓ కొత్త పదం కనిపెడితే తప్ప శ్రీలంక సైనికుల ఘోర కృత్యాలను వర్ణించలేము. శ్రీలంక లో సింహళుల జాతి వివక్షను వ్యతిరేకిస్తూ ఎల్.టి.టి.ఇ ప్రారంభించిన యుద్ధం ‘ప్రత్యేక ఈలం’ ను డిమాండ్ చేసేవరకూ వెళ్లింది. రెండు దశాబ్దాల పాటు సాగిన వారి ఘర్షణలో శ్రీలంక సైన్యం 2009 లో పై చేయి సాధించడంతో…

శ్రీలంక పాలకుల ‘తమిళ జాతి హత్యాకాండ’ పై రెండో డాక్యుమెంటరీ

ఎల్.టి.టి.ఈ పై యుద్ధంలో చివరి రోజుల్లో తమిళ పౌరులపై శ్రీలంక పాలకుల పనుపున శ్రీలంక సైన్యం జరిపిన ‘జాతి హత్యాకాండ’ పై రెండవ వీడియో డాక్యుమెంటరీ వెలువడింది. “శ్రీలంకాస్ కిల్లింగ్ ఫీల్డ్స్: వార్ క్రైంస్ అన్ పనిష్డ్” పేరుతో పేరుతో బ్రిటన్ కి చెందిన చానెల్ 4 ఈ డాక్యుమెంటరీ తీసింది. ఇదే చానెల్ సంవత్సరం క్రితం వెలువరించిన డాక్యుమెంటరీకి ఇది కొనసాగింపు. ఈ వీడియోను బూటకం గా శ్రీలంక ప్రభుత్వం అభివర్ణించింది. వీడియో సాధికారతను, విశ్వసనీయతను…

‘మందుపాతర’కు ప్రతీకారమే ‘ఆఫ్ఘన్ హత్యాకాండ’

ఆఫ్ఘనిస్ధాన్ ప్రజల అత్యాధ్మిక రాజధాని కాందహార్ సమీపాన అమెరికా సైనికులు రెండు గ్రామాల్లో (బలాంది, అల్కోజాయ్), మూడు ఇళ్ళల్లో జొరబడి 16 మంది పౌరులను చంపింది మతి భ్రమించి కాదని, హత్యాకాండకు కొద్ది రోజుల ముందు అమెరికా సైనిక కాన్వాయ్ పైన తాలిబాన్ ప్రయోగించిన మందుపాతర’ కు ప్రతీకారమేనని రాయిటర్స్ వార్తా సంస్ధ కధనం వెల్లడించింది. ఆ కధనం ఇలా ఉంది. DEMAND FOR TRIAL in AFGHANISTAN The U.S. military hopes to withdraw…

యుద్ధాలు శా(శ్వా)సించేవారు రాజనీతిజ్ఞులు, యుద్ధం చేసే సైనికులు పిచ్చోళ్ళు?!

ఆఫ్ఘనిస్ధాన్ లో అమాయక పౌరుల ఇళ్ళల్లో జొరబడి నిద్రలో ఉన్న 16 మంది ని కాల్చి చంపిన అమెరికా సైనికుడు వాషింగ్టన్ రాష్ట్రంలోని టకోమా వద్దగల ఆర్మీ మరియు ఎయిర్ ఫోర్స్ బేస్ నుండి వచ్చాడు. ఈ స్ధావరాన్ని ‘లూయిస్ మెక్-కార్డ్’ బేస్ గా పిలుస్తారు. ఈ స్ధావరం నుండి వచ్చిన సైనికులు గతంలో కూడా ఇలాంటి హత్యాకాండలకి పాల్పడ్డారనీ, అసలా స్ధావరంలోనే ఏదో ఉందనీ పశ్చిమ దేశాల పత్రికలు కధనాలు రాస్తున్నాయి. 2010 లో కూడా…

మరో హత్యా కాండ, ఈ సారి సిరియాలో

ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా సైనికులు ఆఫ్ఘన్ పౌరులను ఊచకోత కోసిన రెండవ రోజే సిరియాలో పౌరుల ఊచకోత జరిగింది. సిరియాలో జొరబడి సంవత్సర కాలంగా అద్దె తిరుగుబాటు నడుపుతున్న పశ్చిమ దేశాల కిరాయి మూకలు తాజాగా ఈ హత్యా కాండకు పాల్పడ్డాయని సిరియా ప్రభూత్వ మీడియాను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. ఐక్యరాజ్య సమితి మాజీ అధ్యక్షుడు కోఫీ అన్నన్ సిరియా సందర్శిస్తున్న సందర్భంలో ఆయనను ప్రభావితం చేయడానికే విదేశీ కిరాయి మూకలు ఈ హత్యాకాండకి దిగాయని సిరియా…