ఆఫ్రికాపై సామ్రాజవాద ఆధిపత్యం కోసం అమెరికా దీర్ఘకాలిక యుద్దం -జేమ్స్ పెట్రాస్

ఆఫ్రికా ఖండంలోని దేశాలలోని వనరులపై ఆధిపత్యం కోసం అమెరికా 1950 ల నుండే మిలట్రీ జోక్యం ప్రారంభించిందనీ, దానిలో భాగంగానే ప్రస్తుతం లిబియాలోని గడ్డాఫీ ప్రభుత్వాన్ని కూలదోసి తనకు అనుకూలమైన దిష్టిబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఫ్రాన్సు, బ్రిటన్ లతో కలిసి దురాక్రమణ దాడులకు పూనుకుందని అమెరికాకి చెందిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు జేమ్స్&‌ పెట్రాస్ వివరించాడు. ఆయన మాటల్లొనే చెప్పాలంటే: ——————– “కాంగ్రెషనల్ రీసర్చ్ సర్వీస్” ఆధ్వర్యంలో ‘లారెన్ ఫ్లోక్’ అధ్యయనం చేసి ఒక నివేదికను నవంబరు…

లిబియాపై యుద్ధానికి హంతక డ్రోన్ విమానాలను పంపిన అమెరికా

వందలకొద్దీ పాకిస్తాన్ పౌరులను చంపిన డ్రోన్ విమానాలను లిబియా పౌరులను రక్షించడానికి(!) పంపేందుకు ఒబామా ఆమోదముద్ర వేశాడు. ఇప్పటికే ఒక సారి దాడికి వెళ్ళిన డ్రోన్ విమానం వాతావరణం అనుకూలించక వెనుదిరిగినట్లు అమెరికా సైనిక దళాలా జాయింట్ ఛీఫ్ తెలిపాడు. తక్కువ ఎత్తులో ప్రయాణించే మానవరహిత డ్రోన్ విమానాలను అమెరికా, ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్తాన్ సరిహద్దుల్లో పాకిస్తాన్ భూభాగంలో ఉన్న తాలిబాన్ నాయకులను, మిలిటెంట్లను చంపడానికి విస్తృతంగా వినియోగిస్తోంది. వాటిబారిన పడి పాకిస్ధాన్ పౌరులు అనేకమంది చనిపోయారు. డ్రోన్…

టెర్రరిస్టులకు ఐ.ఎస్.ఐ మద్దతునిస్తోంది -అమెరికా మిలట్రీ ఛీఫ్

ఆఫ్ఘనిస్ధాన్ టెర్రరిస్టులకు పాకిస్తాన్ గూఢచారి సంస్ధ ఐ.ఎస్.ఐ రహస్యంగా మద్దతునిస్తోందని అమెరికా మిలట్రీ ఉన్నతాధికారి “మైక్ ముల్లెన్” సంచలనాత్మక ఆరోపణ చేశాడు. మైక్ ముల్లెన్ పాకిస్తాన్ మిలట్రీ అధికారులతో చర్చల నిమిత్తం ఇస్లామాబాద్ లో ఉన్నాడు. ఆఫ్ఘనిస్ధాన్ మిలిటెంట్ల నాయకుడు జలాలుద్దీన్ హఖానీ నడుపుతున్న సంస్ధతో ఐ.ఎస్.ఐకి దీర్ఘకాలింగా గట్టి సంబంధాలు ఉన్నాయనీ ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా సైనికులను చంపడంలో ఈ సంస్ధ నిమగ్నమై ఉందనీ ఆరోపించాడు. ఆఫ్ఘనిస్ధాన్ లో టెర్రరిస్టు సంస్ధలుగా అమెరికా పరిగణించే సంస్ధలను…

హోండురాస్ లో మరో మిలట్రీ స్ధావరాన్ని తెరవబోతున్న అమెరికా

2009 లో మిలట్రీ కుట్ర ద్వారా హోండురాస్ ప్రభుత్వాన్ని కూల్చివేసిన తర్వాత అక్కడ మరో మిలట్రీ స్ధావరం నెలకొల్పడానికి అమెరికా ఒప్పందం కుదుర్చుకుంటోంది. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన మాన్యువల్ జెలాయా నాయకత్వంలోని ప్రభుత్వాన్ని అక్కడి మిలట్రీ, ప్రతిపక్షాలు కుమ్మక్కయ్యి కుట్ర తో కూల్చి వేశాయి. రాజ్యాంగాన్ని ఉల్లంఘించాడన్న నేరాన్ని మోపి రాత్రికి రాత్రి విమానం ఎక్కించి కోస్టారికా దేశానికి ప్రవాసం పంపారు. జెలాయా అధికారంలోకి వచ్చాక కార్మికులకు కనీస వేతనాలను పెంచడం తదితర చర్యలను చేపట్టడంతో పెట్టుబడిదారులు,…

జపాన్ అణు కర్మాగారం పేలనున్న టైంబాంబుతో సమానం -అణు నిపుణుడు

భూకంపం, సునామిల్లో దెబ్బతిన్న జపాన్ లోని ఫుకుషిమా దైచి అణువిద్యుత్ కర్మాగారం వద్ద రేడియేషన్ తగ్గుతోందని జపాన్ ప్రభుత్వం చెబుతున్నా, వాస్తవానికి అది పేలడానికి సిద్ధంగా ఉన్న టైంబాంబుతో సమానమని అమెరికాకి చెందిన అణు నిపుణుడు మిచియో కాకు హెచ్చరించాడు. న్యూయార్క్ లోని సిటీ యూనివర్సిటీలో ఫ్రొఫెసర్ గా పనిచేస్తున్న భౌతిక శాస్త్రవేత్త మిఛియో కాకు అమెరికాకి చెందిన డెమొక్రసీ నౌ టీవీ చానెల్ తో మాట్లాడుతూ జపాన్ అణు ప్రమాదానికి సంబంధించిన వాస్తవాలను వెల్లడించాడు. ఫుకుషిమాలోని…

ధనికులకు పన్ను తగ్గింపు, పేదలకు సంక్షేమ పధకాల కోత; అమెరికాలో దారుణం

అమెరికా ఆర్ధిక సంక్షోభం నుండి ఇంకా కోలుకోలేదు. దేశంలో ధనికుల వద్ద డబ్బు మూల్గుతుంటే పేదలు, మధ్య తరగతి ఆదాయాలు లేక ప్రభుత్వ సంక్షేమ పధకాల మీద ఆధారపడుతున్నారు. ఈ పరిస్ధితుల్లో సంక్షోభ పరిష్కారానికి వెంటనే తట్టే ఆలోచన: ధనికులకు పన్ను పెంచి తద్వారా ఆదాయం పెంచుకోవడం. కాని అమెరికా ప్రతినిధుల సభకు దీనికి పూర్తిగా వ్యతిరేకమైన ఐడియా తట్టింది. నిజానికి ఇది ఐడియా కాదు విధానం. అమెరికాలోని ప్రతినిధుల సభకు గత సంవత్సరం జరిగిన ఎన్నిల్లో…

లిబియా దాడులపై అమెరికా, ఫ్రాన్సులకు దొరకని మద్దతు

లిబియా పౌరుల రక్షణ పేరుతో ఆ దేశంపై వైమానిక దాడులను తీవ్రతరం చేయడానికి అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ దేశాలు మరిన్ని నాటో దేశాల మద్దతు కోరినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. గురువారం బెర్లిన్ లో నాటో దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. లిబియాపై వైమానిక దాడులు చేస్తున్న ఆరు నాటో దేశాలతో పాటు మిగిలిన దేశాలు కూడా బాంబు దాడులు ప్రారంభించాలని ఈ సమావేశంలో అమెరికా, ఫ్రాన్సు, ఇంగ్లంద్ దేశాలు కోరాయి. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్…

పాకిస్తాన్ ప్రభుత్వం, ఐ.ఎస్.ఐ ల ఆదేశంతోనే ముంబై దాడులు -అమెరికా కోర్టులో హేడ్లీ, రాణాలు – 1

ముంబై లోని తాజ్ హోటల్ పై టెర్రరిస్టు దాడులు పాకిస్తాన్ ప్రభుత్వం, దాని గూఢచార సంస్ధ ఐ.ఎస్.ఐ ల ఆదేశమ్ మేరకే చేశామని అమెరికా కోర్టులో నిందితులు హేడ్లీ, రాణాలు సాక్ష్యం ఇచ్చినట్లు బయటపడడంతో సంచలనానికి తెర లేచింది. ముంబై టెర్రరిస్టు దాడుల్లో తాజ్ హోటల్ లో బస చేసిన దేశ, విదేశీ అతిధులు 200 మంది వరకూ మరణించిన సంగతి విదితమే. ముంబై దాడుల్లో పట్టుబడ్డ పాకిస్తాన్ యువకుడు కసబ్ కి కోర్టు మరనశిక్ష విధించింది.…

సి.ఐ.ఏ హద్దు మీరుతోంది -అమెరికాకు పాకిస్తాన్ హెచ్చరిక

ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్, ఆల్-ఖైదా లపై యుద్ధానికి పాకిస్తాన్ పైనే పూర్తిగా ఆధారపడ్డ అమెరికా, ఇటీవలి కాలంలో పాకిస్తాన్ నుండి ప్రతిఘటనను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా పాకిస్తాన్ లో సి.ఐ.ఏ కార్యకలాపాల పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం, మిలట్రీ, ఐ.ఎస్.ఐ లు ఆగ్రహంతో ఉన్నాయి. సి.ఐ.ఏ ఆధ్వర్యంలో నడిచే డ్రోన్ విమానాల దాడుల్లో వందలమంది పాకిస్తాన్ పౌరులు చనిపోతుండడంతో పాకిస్తాన్ ప్రజల్లో అమెరికా పట్ల విపరీతమైన ద్వేషం పెరిగింది. పాకిస్తాన్ అణ్వస్త్రాలను నిర్వీర్యం చేయడమే అమెరికా`ప్రభుత్వ అసలు ఉద్దేశమని కూడా…

ఆసియా-ఫసిఫిక్ ప్రాంతంలో అమెరికా ఆయుధ పోటీ -చైనా శ్వేతపత్రం

ఆసియా-ఫసిఫిక్ ప్రాంతంలొ అమెరికా ఆయుధ పోటీ పెంచుతున్నదని చైనా అభిప్రాయపడింది. చైనా ప్రభుత్వం జారీ చేసిన ‘జాతీయ రక్షణ శ్వేత పత్రం’ లో చైనా, దాని చుట్టూ ఉన్న రక్షణ పరిస్ధితులను విశ్లేషించింది. ఆసియా-ఫసిఫిక్ ప్రాంతంలో అమెరికా మిలట్రీ ఉనికి పెరుగుతున్నదని శ్వేత పత్రం తెలిపింది. ఈ ప్రాంతంలోని సైనిక చర్యలు అంతిమంగా చైనాకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టబడి ఉన్నాయని పత్రం తెలిపింది. భద్రతాంశాలపై చైనా దృక్పధాన్నీ, తన రక్షణ బలగాల గురించిన సమగ్ర దృక్పధాన్ని శ్వేత పత్రం…

చైనా, దక్షిణకొరియా, జర్మనీ లను దాటి అమెరికా వరకూ వ్యాపించిన జపాన్ అణుప్రమాద రేడియేషన్

జపాన్లోని ఫుకుషిమా అణువిద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం ప్రపంచంలోని ఇతర దేశాలకూడా పాకింది. వాతావరణం ద్వారా గాలితో వ్యాపించి అమెరికా దాకా చేరుకుంది. ఫుకుషిమా దైచి కర్మాగారం వద్ద రేడియేషన్ తో కూడిన గాలి సహజంగా వేడిగా ఉంటుంది. వేడిగా ఉన్న గాలి తేలిక పడి వాతావరణంలోని పైపొరలకు చేరుకుని అక్కడ పశ్చిమం నుండి తూర్పుకు వీచే గాలి ద్వారా చైనా వరకూ వ్యాపించింది. అయితే చాలా దూరం ప్రయాణించి రావడం, కొద్ది పరిమాణంలో ఉండే రేడియేషన్…