అమెరికా వెతికిందెక్కడ? లాడెన్ దొరికిందెక్కడ?
సెప్టెంబర్ 11, 2001 న న్యూయార్కు నగరంలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కార్యాలయం ఉన్న జంట టవర్లను ముస్లిం టెర్రరిస్టులుగా చెప్పబడుతున్నవారు అమెరికా విమానాలతో ఢీ కొట్టారు. విమానాలు ఢీకొట్టాక రెండు టవర్లు ఒక పద్ధతి ప్రకారం కూలిపోయిన దృశ్యాన్ని ప్రపంచం అంతా వీక్షించింది. కొన్ని గంటల్లోనే టవర్లను ఢీకొన్న విమానాలను నడిపినవారిని ఆ పనికి పురమాయించిందెవరో అమెరికా కనిపెట్టి ప్రకటించింది. ఆఫ్ఘనిస్ధాన్‌లో తాలిబాన్ ప్రభుత్వ రక్షణలొ ఉన్న ఒసామా బిన్ లాడెన్ ఆదేశాల ప్రకారమే టవర్లను…