మాపై దాడి చేస్తే ఇజ్రాయెల్‌పైనా, అమెరికా సైనిక స్ధావరాలపైనా ప్రతిదాడికి మేం సిద్ధం -ఇరాన్
“ఇరాన్‌పై దాడికి తెగబడితే మేము కూడా ఇజ్రాయెల్ పైనా, ఈ ప్రాంతంలో అమెరికా ఏర్పాటు చేసుకున్న సైనిక స్ధావరాలపైనా దాడి చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం” అని ఇరాన్ ప్రకటించింది. మధ్య ప్రాచ్యంలో ఇరాన్ తమ ప్రధాన శతృవుగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు భావిస్తాయి. ప్రాంతీయంగా ఇజ్రాయెల్ ఆధిపత్యానికి ఇరాన్ నుండే ముప్పు ఉందని అమెరికా, పశ్చిమ దేశాలు భావిస్తాయి. ఇజ్రాయెల్ వద్ద 300 కి పైగా అణ్వాయుధాలు ఉన్నప్పటికీ, అంతర్జాతీయ అణు ఇంధన సంస్ధ (ఐ.ఏ.ఇ.ఏ)…