ఆఫ్ఘన్ యుద్ధంలో నాటో కుక్కలు -ఫోటోలు

మానవ సమాజానికి మొదటి సారి మచ్చికయిన పాపానికి కుక్కలు సైతం మనిషి చేసే అనేక పాపాల్లో భాగం పంచుకోవలసి వస్తోంది. వ్యాపారం పెంపుదల కోసం, ప్రత్యర్ధి వ్యాపారాన్ని కూల్చడం కోసం యుద్ధాలకు తెగబడడానికి మించిన పాపం ఏముంటుంది? అలాంటి మహా పాపంలో అమెరికా, ఐరోపా కుక్కలు భాగం పంచుకుంటూ తమకు తెలియకుండానే బహుశా నరక లోకానికి చేరుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ ను దురాక్రమించిన అమెరికా, నాటో బలగాలు తమతో పాటు సుశిక్షిత కుక్కలను తెచ్చుకుని అనేక కార్యకలాపాల్లో వాటిని…