ముంబై పేలుళ్ళ నిందితుల్లో ఒకరి ఊహా చిత్రం రెడీ -ఎ.టి.ఎస్
ముంబై వరుస పేలుళ్ళ నిందితుల్లో ఒకరి ఊహా చిత్రం సిద్ధం చేశామని “యాంటి టెర్రరిస్టు స్క్వాడ్” (ఎ.టి.ఎస్) తెలిపింది. ఊహాచిత్రాన్ని ప్రజలు చూడడానికి విడుదల చేయడం లేదని తెలిపింది. బహుశా నిందితులు అప్రమత్తం అవుతారన్న అనుమానంతో ఎ.టి.ఎస్ ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. బాంబు పేలిన ఒక స్ధలంవద్ద ప్రత్యక్ష సాక్షి కధనంపై ఆధారపడి ఈ ఊహాచిత్రాన్ని గీయించినట్లుగా ఎ.టి.ఎస్ తెలిపింది. చిత్రాన్ని వివిధ దర్యాప్తు సంస్ధలకు అందజేశామని తెలిపింది. దర్యాప్తు సంస్ధలతో పాటు కొద్దిమంది ఎన్నుకున్న…