ఎడతెగని హింసా క్షేత్రం ఉక్రెయిన్ -ఫోటోలు
యూరోపియన్ యూనియన్ కి అనుకూలంగా రెచ్చగొట్టబడిన ఆందోళనలు తీవ్ర హింసారూపం దాల్చడంతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ వీధుల్లో రక్తం పారుతోంది. గురు, శుక్రవారాల్లో జరిగిన హింసాత్మక దాడులు, ప్రతిదాడుల పర్యవసానంగా 70 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భద్రతా బలగాలే భవంతులపై నుండి కాల్పులు జరపడం వలన ఆందోళనకారులు మరణించారని పశ్చిమ పత్రికలు ప్రచారం చేస్తున్నాయి. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు అసలు కీవ్ లోనే లేకపోవడం, రక్తపాత దాడులు అరికట్టడానికి యూరోపియన్ దేశాల నేతలు కుదిర్చిన…

