మృ(మ)గత్వాన్ని ధిక్కరించి, రాజ్యాధిపత్యాన్ని వణికించిన సాహసి ఇక లేదు
యావత్భారతదేశాన్ని అశ్రుధారల్లో ముంచుతూ ఆ సాహసిక యువతి తుదిశ్వాస విడిచింది. క్రూర మృగాలు సైతం సిగ్గుపడేలా ఆరుగురు మగవాళ్ళు అత్యంత హేయమైన రీతిలో ఆడిన పాశవిక మృత్యుక్రీడలో ఆమె ఆవిసిపోయి సెలవు తీసుకుంది. శరీరాన్ని నిలిపి ఉంచే వివిధ అవయవాలు విషతుల్యమైన రక్తం ధాటికి ఒక్కొక్కటీ కూలి సోలిపోగా కుటుంబసభ్యుల మధ్యా, పేరు మోసిన వైద్యుల మధ్యా శాశ్వతంగా కన్నుమూసింది. పోతూ పోతూ అభివృద్ధి సాధించామని చెప్పుకుంటున్న నాగరీక మానవుల మానవత్వాన్ని పరిహసించి పోయిందామె. “ఆమెను బతికించడానికి…

