ఉపాధి పొందే హక్కు ప్రతి ముస్లిం సొంతం -ఆర్ఎస్ఎస్ చీఫ్
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ అయిన మోహన్ భగవత్ ముస్లింల పట్ల దయ తలిచారు. హిందువులు, ముస్లింలు అన్న తేడా కూడదనీ, వాళ్ళిద్దరూ ఇప్పటికే ఒక్కటయ్యారని తేల్చి చెప్పారు. భారత దేశంలో ఉపాధి పొందే హక్కు ప్రతి ఒక్క ముస్లిం వ్యక్తికీ ఉన్నదని కూడా చాటారు. ఆర్ఎస్ఎస్ సంస్థ రెండవ గురువు, సిద్ధాంత కర్తగా పేర్కొనే గురు గోల్వాల్కర్ గారు ముస్లిం లకు అలాంటి స్వేచ్ఛ ఉందన్న సంగతి నిరాకరించారు. ముస్లిం మతావలంబకులు…

