మోడి మార్కు లక్ష్మణ రేఖ -కార్టూన్
ప్రధాని నరేంద్ర మోడి తన లక్ష్మణ రేఖ ప్రకటించారు. సాధ్వి నిరంజన్ జ్యోతి ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ‘రామ్ జాదే – హరామ్ జాదే’ అంటూ చేసిన ప్రసంగం ఉభయ సభల్లో ప్రతిపక్షాలకు ఆయుధం ఇవ్వడంతో ఆయన ‘కొత్త మంత్రులు, పార్టీ నేతలు’ ‘నియంత్రణ’లో ఉండాలని లక్ష్మణ రేఖ గీశారు. ఇంత గొడవ జరుగుతుంటే ప్రధాని ఎక్కడ? అంటూ ప్రతిపక్షాలు గర్జించడంతో పార్లమెంటుకు వచ్చిన ప్రధాని ‘కొత్త మంత్రి, గ్రామీణ నేపధ్యం, అంతా కొత్త. అయినా ఆపాలజీ…